ఏపీ రాష్ట్రానికి చెందిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకి భద్రత పెంచారు. ఆయనకు ప్రస్తుతం వై కేటగిరి భద్రత ఉండగా ఇప్పుడు ఆయనకు వై ప్లస్ కేటగిరీ కేటాయించారు. ప్రస్తుతం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కి పెంచిన భద్రతతో ఆయనకు రాష్ట్ర పోలీసుల తరపున ఇద్దరు గన్ మెన్ లతోపాటు మరో ఇద్దరు సీఆర్పీఎఫ్ అధికారులు భద్రత కల్పిస్తారు. భారత్ - పాకిస్తాన్ యుద్ధ సమయంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కు ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా కేంద్రం భద్రత పెంచింది. భారత్ ప్రస్తుతం పాకిస్తాన్ యొక్క ఉగ్ర స్థావరాల పైన దాడులు కొనసాగిస్తున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంది. రామ్మోహన్ నాయుడు భద్రతను వై ప్లస్ కేటగిరీకి పెంచడంతో కేంద్రం నియమించిన చీఫ్ సెక్యూరిటీ అధికారి, సీఆర్పీఎఫ్ కమాండో ఆయనకు భద్రతగా విధుల్లో చేరారు.ఇక మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి సైతం భద్రతకు సంబంధించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆదేశించారు.

ఆపరేషన్ సిందూర్ తర్వాత వివిధ ప్రాంతాలలో చేపట్టిన భద్రతా చర్యలు, వివిధ సంస్థల రక్షణ, ప్రజలతో పాటు వీఐపీల భద్రత ఏపీలో ఉన్నతాధికారులు హై లెవెల్ రివ్యూ నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి భద్రతా చర్యలు మరింత పటిష్టంగా ఉండాలని, సెక్యూరిటీకి సంబంధించిన ప్రోటోకాల్స్ తూచా తప్పకుండా పాటించాలని, జనసమూహం లో చంద్రబాబు రక్షణకు పాటించాల్సిన నిబంధనలపైన, ప్రత్యేక ఏర్పాట్లపైన దృష్టి పెట్టాలని,  సెక్యూరిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని ఏపీ డీజీపీ అధికారులకు సూచించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos