ఏపీలో ఒక ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ ప్రారంభమైంది. గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ మొదలైంది. సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఈ నెల 9న కాకినాడలో కౌంటింగ్ జరగనుంది. సాధారణ ఎన్నికల మాదిరిగానే పోటీ ప్రతిష్టాత్మకంగా మారింది. చివరి నిమిషం వరకు అభ్యర్థులు ఉధృతంగా ప్రచారం చేశారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేశారు. పోటీలో చాలామంది ఉన్నా ఇద్దరు అభ్యర్థుల మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ఉభయగోదావరి జిల్లాలోని 116 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. బ్యాలెట్ పద్ధతిలో ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.సాయంత్రం పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్స్ లను కాకినాడలోని స్ట్రాంగ్ రూముకు తరలించనున్నారు. ఈ నెల తొమ్మిదిన ఓట్ల లెక్కింపు నకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇక్కడ ఎమ్మెల్సీగా ఉన్న షేక్ సాబ్జి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. బ్యాలెట్ పత్రాలపై ప్రాధాన్యత క్రమంలో ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో బొర్రా గోపి మూర్తి, గంధం నారాయణరావు, దీపక్, కవల నాగేశ్వరరావు, వెంకటలక్ష్మి పోటీలో ఉన్నారు. వీరిలో గోపి మూర్తి, గంధం నారాయణరావుల మధ్య ప్రధానంగా పోటీ ఉంది. ఇప్పటికే వీరికి వివిధ ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలిపాయి. ఎన్నికల్లో గోపి మూర్తి తొలిసారిగా బరిలో దిగారు. ఈయనకు యూటీఎఫ్ తో పాటు పలు సంఘాలు మద్దతు ప్రకటించాయి. గంధం నారాయణరావుకు ఎస్టీయూ తో పాటు మరి కొన్నిసంఘాలు మద్దతు తెలిపాయి. దీంతో ఇద్దరి మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టు ఉంది.

అయితే ఇక్కడ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ పోటీ చేయలేదు. అనుబంధ విభాగాలు కూడా రంగంలోకి దిగలేదు. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇదే మాదిరిగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగింది. కానీ తక్కువ మెజారిటీతో బయటపడింది. అప్పటి అనుభవంతో ఏ రాజకీయ పార్టీ ముందుకు వచ్చే పరిస్థితి కనిపించలేదు. అందుకే ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. విజేత ఎవరనేది ఈ నెల 9న తెలియనుంది. అప్పటిదాకా పరిస్థితి ఉత్కంఠ భరితంగానే ఉంటుందని పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు అంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos