ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాజీ ఎమ్మెల్యే వంగవీటి  రాధాకృష్ణ బుధవారం సాయంత్రం అమరావతిలో భేటీ అయ్యారు. వంగవీటి రాధాకు పదవి దక్కుతుందని చాలా కాలంగా అనుచరులు ఎదురు చూస్తున్నారు.. అయితే ఇటీవల ఎమ్మెల్సీల జాబితాలో వంగవీటి రాధా పేరు లేకపోవడంతో అనుచర వర్గం నిరాశలో ఉన్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబును వంగవీటి రాధా కలవడం ప్రాధాన్యత సంతరించుకొంది.. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఆయనకు త్వరలోనే పదవి ఖాయమనే చర్చ జరుగుతోంది. వంగవీటి రాధా ఎన్నికల తర్వాత కూడా యాక్టివ్‌గా ఉన్నారు.. కూటమి పార్టీల కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే అనుచరులు ఆయనకు పదవి ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే సీఎంవో నుంచి పిలుపు రావడంతోనే వంగవీటి రాధా చంద్రబాబును కలిసినట్లు ప్రచారం జరుగుతోంది.

వంగవీటి రాధా 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు.. కేవలం టీడీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం మాత్రమే చేశారు. కానీ 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది.. అయితే రాధా పార్టీ కార్యక్రమాలకు కొంతకాలం దూరంగా ఉన్నారు. అయితే ఆ తర్వాత మళ్లీ యాక్టివ్ అయ్యారు.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను ప్రత్యేకంగా కలవడంతో ఆయన జనసేన పార్టీలోకి వెళతారనే టాక్ వినిపించింది. కానీ ఆయన మాత్రం టీడీపీలోనే కొనసాగారు.. అయితే 2024 ఎన్నికలకు ముందు ఆయన వైఎస్సార్‌సీపీలోకి తిరిగి వెళతారంటూ కొందరు ప్రచారం చేశారు. ఆయన మాత్రం పార్టీ మారలేదు.

కాగా కూటమి అధికారంలోకి వస్తే.. రాధాకు పదవి ఇస్తామనే భరోసా టీడీపీ ఇచ్చినట్లు టాక్ వినిపించింది. ఈ క్రమంలో ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదు స్థానాల్లో ఒకటి రాధాకు కేటాయిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆయనకు పదవి దక్కలేదు. ఈ క్రమంలో చంద్రబాబును కలవడంతో రాధాకు పదవిపై చంద్రబాబు ఏదైనా హామీ ఇచ్చారా అనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఆయనకు పదవి వస్తుందని అనుచరులు భావిస్తున్నారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.

వంగవీటి రాధాకృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలిచారు. 2008లో ఆయన ప్రజారాజ్యం పార్టీలో చేరి.. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. రాధా 2014 ఎన్నికల ముందు వైఎస్సార్‌సీపీలో చేరి.. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేసి ఓడారు. ఆయన 2015లో వైసీపీ విజయవాడ నగర అధ్యక్షుడిగా, విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ సమన్వయకర్తగా పని చేశారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. ఈ క్రమంలో.. ఇప్పుడు రాధాకు పదవి దక్కుతుందనే ప్రచారంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos