ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీ కేబినెట్ భేటీలో అమరావతి సహా పలు కీలక అంశాల పైన చర్చించారు. యుద్దం కారణంగా ఏర్పడిన పరిస్థితులు.. రాష్ట్రంలో వంట గ్యాస్ సరఫరా పైన అధికారులు వివరించారు. ఇప్పటికే నియమించిన కేబినెట్ సబ్ కమిటీ అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. వేసవి వేళ కీలక నిర్ణయాల అమలు కు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక, మంత్రులకు ముఖ్యమంత్రి చేసిన హెచ్చరిక ఇప్పుడు సంచలనంగా మారింది. అధికారిక అజెండా పూర్తి చేసిన తరువాత మంత్రులతో తాజా పరిస్థితుల పైన సీఎం చంద్రబాబు చర్చించారు. ఏప్రిల్ 1 నుంచి 90 రోజులు పాటు జలధార కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. భూగర్భ నీటిమట్టం పెంచాల ని సూచించారు. మే 15 నుంచి కాలువలకు నీరు విడుదల చేయాలన్నారు. ఇందుకు మంత్రులు రైతులను సమాయత్తం చేయాలని సూచించారు. వెలుగొండ ఫేజ్ 1 ను ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి చేస్తామని సీఎం స్పష్టం చేసారు. కృష్ణా కరకట్ట కు బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో పటిష్ట పరచాలని ఆదేశాలు ఇచ్చారు. మార్చి 16 న అన్ని జిల్లాలో పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమం  నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ఈ కార్యక్రమం కోసం మంత్రి సవిత ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసారు. కాగా, యుద్ధం కారణంగా ప్రజలు ఇబ్బంది పడకుండా ఒక కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ఈ సబ్ కమిటీలో మంత్రులు కేశవ్, అచ్చం నాయుడు, నాదెండ్ల మనోహర్ సభ్యులుగా ఉంటారు. గ్యాస్ లేని పక్షంలో ఇండక్షన్ స్టవ్ లు కొంటున్నారని మంత్రి కేశవ్ చెప్పుకొచ్చారు. కాగా, శాఖల్లో మంత్రులు, అధికారులపై కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ను ఏప్రిల్ 2 వ తేదీన ఇస్తానని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ నివేదిక ఆధారంగా 2026-2027 సంవత్చరంలో పని తీరు మెరుగుపరచుకోవాలని సూచించారు. ఈ నివేదిక లో లక్ష్యాలు సాధించడం, ఫైల్స్ క్లియరెన్స్, కేంద్ర నిధులు వినియోగం, పథకాల అమలు వంటి అంశాలు రహస్య నివేదికలో ఉంటాయని వెల్లడించారు.

పంచాయతీల మాదిరిగా జలవనరుల శాఖ కూడా నీటి పన్ను వసూలు చేయాలని  మంత్రి రామానాయుడు కు చెప్పిన సీఎం.. మంత్రులు చేసిన పనిని మీరు మీడియా కు చెప్పుకోవడంలో ఫెయిల్ అవుతున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు ప్రభుత్వాన్ని స్థిరత్వానికి తీసుకువచ్చామని... ఇక ఇప్పుడు టేక్ ఆఫ్ చేయాలని చెప్పారు. అందరూ టెక్నాలజీని ఉపయోగించుకోవాలని నిర్దేశించారు. ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని.. అందరు సిద్ధంగా ఉండాలని చెప్పిన సీఎం..ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లో గెలిచామని చెప్పారు. ఇక.. ఎన్నిక ఏదైనా మనమే గెలవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos