తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ ( వి. హనుమంతరావు) తాజాగా చంద్రబాబును కలిశారు. వీహెచ్  విజయవాడలో చంద్రబాబును కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్బంగా కొద్దిసేపు చంద్రబాబు, వీహెచ్ ముచ్చటించుకున్నారు. చంద్రబాబును కలిసిన సందర్భంగా వీహెచ్ తన మనసులోని కోరికను బయటపెట్టినట్లు తెలిసింది. అదేంటంటే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఒక జిల్లాకు దివంగత నేత, మాజీ సీఎం దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని వీహెచ్, చంద్రబాబును కోరారు. అలాగే దామోదరం సంజీవయ్య పేరుతో స్మృతివనం నిర్మించాలని వీహెచ్ చంద్రబాబును కోరారు. ఇందుకు చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారని వీహెచ్ తెలిపారు. మాజీ సీఎం దామోదరం సంజీవయ్య అత్యంత నిజాయతీపరుడని వీహెచ్ కొనియాడారు. చంద్రబాబు వీహెచ్ భేటీలో తాజా రాజకీయ పరిస్థితులు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది.  చంద్రబాబు నాయుడు గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన సంగతి తెలిసిందే.

మరోవైపు దామోదరం సంజీవయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్మమంత్రిగా పనిచేశారు. అలాగే తొలి దళిత ముఖ్యమంత్రిగా ఖ్యాతి గడించారు. సంయుక్త మద్రాసు రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, కేంద్రంలో కూడా అనేక పదవులను అలంకరించారు. అలాగే 38 సంవత్సరాల పిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయిన ఘనత దామోదరం సంజీవయ్యది. ఈయన కర్నూలు జిల్లా కల్లూరు మండలంలోని పెద్దపాడు గ్రామంలో 1921 ఫిబ్రవరి 14న జన్మించారు. ఐదుగురు పిల్లలు ఉన్న కుటుంబంలో జన్మించారు దామోదరం సంజీవయ్య. ఆయన తల్లిదండ్రులకు సొంతంగా భూమి లేకపోవటంతో నేత పని, కూలీ పని చేసి జీవించేవారు. అయితే చిన్నప్పటి నుంచి పట్టుదలతో చదివి ఉద్యోగం సంపాందించిన దామోదరం సంజీవయ్య.. న్యాయవాద విద్య కూడా అభ్యసించారు. ఆ తర్వాత క్రమంగా రాజకీయాల్లోకి వచ్చారు. మొత్తానికి తెలంగాణకు చెందిన వీహెచ్.. ఏపీ సీఎం చంద్రబాబు కలవడంపై రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos