అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. 133 మంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాధమికంగా సమాచారం అందుతోంది. ఇందులో విదేశీయులు ఉన్నారు. ఘటన చోటు చేసుకున్న వెంటనే కేంద్రం అప్రమత్తమై సహాయక చర్యలు ముమ్మరం చేసింది. ఈ ఘటన పైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న ఈ రోజున ప్రధాన కార్యక్రమాలు ఏర్పాటు చేసారు. విమాన ప్రమాదం కారణంగా చంద్రబాబు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.

నేటితో కూటమి ప్రభుత్వం కొలువు తీరి ఏడాది పూర్తవుతున్న వేళ .. ఈ రోజు సాయంత్రం సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో సభను ఏర్పాటు చేసారు. కాగా, విమాన ప్రమాదం కారణంగా కూటమి ప్రభుత్వ సంవత్సర పాలన విజయోత్సవ సభ రేపటికి వాయిదా వేసారు. కొద్దిసేపటి క్రితం సీఎం నివాసంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించాలని ప్రభు త్వ నిర్ణయించింది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు సీఎం చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అహ్మదాబాద్‌లో జరిగిన విమానం ప్రమాదంతో షాక్‌కు గురైనట్లు సీఎం తెలిపారు.

చనిపోయిన ప్రయాణికుల కుటుంబాలకు, సిబ్బంది కుటుంబాలకు, స్థానిక ప్రజల్లో చనిపోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. అదే విధంగా విమాన ప్రమాదంపై మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా లండన్‌కు చెందిన బోయింగ్ డ్రీమ్ లైనర్ విషాదకరమైన ప్రమాదంతో దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు. ఈ ఘటనపై మంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేశారు. ఈ సంఘటనలో మరణించిన వారి ఆత్మ శాంతి కోసం ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని కేంద్రానికి మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos