లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ మాజీ నేత , మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విచారణకు ఇవాళ హాజరయ్యారు. ఇప్పటికే ఒకసారి విచారణకు వచ్చిన విజయసాయి మరోసారి విచారణ అధికారుల ముందుకు వచ్చారు. ఇదిలా ఉంటే.. ఏపి రాజకీయాల్ని కుదిపేస్తున్న మద్యం కుంభకోణానికి 2019 ఆగస్టు నెలలో విత్తనం పడింది. వైసీపీ పవర్ లోకి వచ్చిన మూడునెలల్లోనే లిక్కర్ పాలసీని సమూలంగా మార్చి, ప్రభుత్వ ఆధ్యర్యంలోనే మద్యం అమ్మకాలు జరిపేలా 3 వేలకు పైగా దుకాణాలకు అనుమతిచ్చి, నాణ్యత, ధర, బ్రాండ్లు అన్నీ తమ ఆధీనంలోనే ఉంచుకుని..మూడువేల కోట్లకు పైగా వెనకేసుకున్నారన్నది అభియోగం.
శ్రీనివాస్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐడీ, గత ఏడాది సెప్టెంబర్ లో ఎఫ్‌ఐఆర్ రాసింది. కేసు తీవ్రతను బట్టి ఎన్టీయార్ జిల్లా సీపీ ఎస్‌వీ రాజశేఖర్‌బాబు నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసి మద్యం స్కామ్‌ను ముందుకు జరిపింది కూటమి సర్కార్. ఐదేళ్లలో 3,500 కోట్లు ముడుపులు తీసుకున్నట్టు ప్రాధమికంగా నిర్ధారించి, మొత్తం 11 మందిని అరెస్ట్ చేసింది సిట్. రాజ్ కెసిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చెరుకూరు వెంకటేష్ నాయుడు, కె. ధనుంజయ్‌రెడ్డి, పి.క్రిష్ణమోహన్‌రెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప, దిలీప్‌కుమార్, చాణక్య.. వీళ్లందరూ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
తొలి అరెస్టు జరిగిన 90 రోజుల్లోగా ప్రిలిమినరీ చార్జ్‌షీట్ దాఖలు చేయాలన్నది నిబంధన. అందుకే.. కేసు విచారణను సిట్ స్పీడప్ చేసింది . మిధున్‌రెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి, రాజ్ కెసిరెడ్డి సూత్రధారులుగా స్కామ్ నడిచిందని, కొందరు నగదు రూపంలో కొందరు బంగారం బిస్కెట్ల రూపంలో, కొందరు షెల్ కంపెనీల్లో పెట్టుబడుల రూపంలో ముడుపులు చెల్లించారని, సిట్ చెబుతోంది. ఇలా సేకరించిన పైకాన్ని ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చుకు మళ్లించారని సిట్ చెబుతోంది. పూర్తిస్థాయి విచారణ జరిగాక సిట్ అధికారులు ఏం తేలుస్తారో మరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos