గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఫిర్యాదుదారు అయిన దళితుడు సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని తాజాగా అరెస్టు చేసి రిమాండ్ పై జైలుకు పంపారు. అయితే ఈ కేసులో తన ప్రమేయం లేదని చెబుతున్న వంశీ తాజాగా విజయవాడ ఎస్సీ, ఎస్టీ న్యాయస్ధానంలో ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన కోర్టు.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు ఇచ్చింది.

ప్రస్తుతం విజయవాడ సబ్ జైలులో ఉన్న వల్లభనేని వంశీ ఇప్పటివరకూ బెయిల్ కోసం అప్పీలు చేసుకోలేదు. మరోవైపు జైల్లో తనకు అదనపు వసతులు కావాలని కోరుతూ విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. జైలులో తనకు వీఐపీ ఖైదీగా పరిగణించాలంటూ వంశీ దాఖలు చేసుకున్న పిటిషన్ పై విచారణకు సిద్దమైన కోర్టు.. అంతకు ముందే పోలీసులకు కీలక ఆదేశాలు ఇచ్చింది.

వల్లభనేని వంశీకి జైలులో ఎలాంటి సదుపాయాలు కావాలో రాతపూర్వకంగా తెలుసుకోవాలని పోలీసుల్ని విజయవాడ ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం ఆదేశించింది. జైలులో వసతులపై వల్లభనేని వంశీ పిటిషన్‌ పై ప్రాథమిక విచారణ జరిపిన కోర్టు.. ఈ మేరకు పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది.

సబ్‌ జైలులో వంశీకి ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఏ సదుపాయాలు కావాలో వంశీ నుంచి లేఖ తీసుకోవాలని తమ ఆదేశాల్లో పేర్కొంది. ఈ వివరాలను ఇవాళ పోలీసులు కోర్టు ముందు ఉంచబోతున్నారు. వీటి ఆధారంగా కోర్టు వంశీకి అదనపు సదుపాయాలు కల్పించాలా లేదా అన్న అంశంపై నిర్ణయం తీసుకోనుంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos