విశాఖపట్నంలోని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గీతం యూనివర్సిటీ కి చెందిన వివాదాస్పద భూముల అంశం పైన కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. కూటమి కార్పొరేటర్లు, వైయస్సార్ కాంగ్రెస్ కార్పొరేటర్లు మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగి చివరికి అది బాహాబాహీ కి దారి తీసింది. నేడు విశాఖపట్నంలో జీవీఎంసీ కార్యాలయంలో జరిగిన  కౌన్సిల్ సమావేశంలో గీతం యూనివర్సిటీ వివాదాస్పద భూముల పైన వైసిపి నిరసన చేపట్టింది. మేయర్ పోడియం ఎదుట వైసీపీ కార్పొరేటర్లు బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో జీవీఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని అడ్డుకునేందుకు వైసీపీతో పాటు, వామపక్షాలు యత్నం చేస్తున్నాయని కూటమి కార్పొరేటర్లు ఆరోపించారు. ఈ సందర్భంగా కూటమి మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఆ తర్వాత అది తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. కౌన్సిల్ హాల్ లో మాత్రమే కాకుండా జీవీఎంసీ ప్రాంగణం బయట కూడా ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. వామపక్ష పార్టీలు మెయిన్ గేట్ ను ముట్టడించగా, పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది.

ఈ ఘర్షణలో వైసీపీ కార్పొరేటర్ లక్ష్మణరావు కాలికి గాయమైంది. ఇక నిరసనలు శృతిమించడంతో మేయర్ సభను వీడి తన చాంబర్ కు వెళ్ళిపోయారు. ఈ సమావేశంలో కూటమి తరపున ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ, పల్లా శ్రీనివాస్, వంశీకృష్ణ హాజరయ్యారు. వైసీపీ తరఫున విశాఖలో భూ దోపిడి పైన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాదుతూ  ... చంద్రబాబు ఆయన కుటుంబం విశాఖలో భూ ఆక్రమణలను చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ పరిధిలో ప్రజా సమస్యల కోసం జరగాల్సిన చర్చ ఉండగా, దానిని పక్కనపెట్టి విశాఖ గీతం యూనివర్సిటీ భూముల పైన రగడ కొనసాగిన క్రమంలో కౌన్సిల్ సమావేశం అర్ధాంతరంగా ఆగిపోయింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు రంగ ప్రవేశం చేశారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos