ఒంటిమిట్ట: ఒంటిమిట్టను టెంపుల్ టూరిజంగా అభివృద్ధి చేస్తామని, ఇక్కడికి వచ్చే భక్తులు రెండు మూడు రోజులు ఉండేలా సదుపాయాలు కల్పిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కడప జిల్లా, ఒంటిమిట్టలో జరిగిన శ్రీసీతారాముల కళ్యాణోత్సవంలో సీఎం చంద్రబాబు దంపతులు పాల్గొని స్వామివార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం సీఎం చంద్రబాబు భక్తులను ఉద్దేశించి మాట్లాడారు.

సీతారాముల వారే వచ్చినట్లుంది

కన్నుల పండువగా ఒంటిమిట్ట సీతారాముల వారి కళ్యాణానికి భక్తులు తరలివచ్చారు. అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా కళ్యాణోత్సవం జరిగింది.  ఇక్కడి వచ్చిన భక్త జనాన్ని చూస్తుంటే సీతారాముల వారు దిగొచ్చి కళ్యాణం చేసుకుంటున్నట్లుగా అనిపించింది. దేవుణ్ని దర్శించుకుని మనం కొన్ని సంకల్పాలు తీసుకుని తలచుకున్నాం. సీతారాముల వారు ఆదర్శ దంపతులు. పరిపాలన అంటే రామపాలన రావాలి..రాముడి పాలన జరగాలని కోరుకుంటారు. సీతారాముల కళ్యాణాన్ని మన ఒంటిమిట్టలో జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం. రాష్ట్ర విభజన తర్వాత కళ్యాణ మహోత్సవాన్ని ఒంటిమిట్టలో చేయాలని ప్రభుత్వం అధికారికంగా నిర్ణయించింది. 11వ శతాబ్ధంలో ఏకశిలా విగ్రహ రూపంలో ఏర్పాటైంది. ఈ ప్రాంతమంతా దేవుడి నామస్మరణంతోనే ఉండాలి. ఇక్కడి చెరువు ఆధునీకరణకు పనులు ప్రారంభించాం.

రామరాజ్యమే నా ఆకాంక్ష

దేవాలయాలు మన వారసత్వ సంపద. ఈ దేవాలయాలు లేకపోతే కుటుంబ వ్యవస్థ ఉండేది కాదు. ఏ దేశానికి లేని గొప్ప వారసత్వ సంపద మన దేశానికి ఉంది. మన తర్వాత వారసులకు కూడా మనం వారసత్వాన్ని అందించాలి. రాముడి పాలన ఇవ్వాలని, రామరాజ్యం తేవాలనేది నా ఆకాంక్ష. రాముడి సాక్షిగా చెప్తున్నా...ప్రతి ఒక్కరికీ మేలు చేయడమే నా ఆలోచన, ధ్యేయం. రామరాజ్యంలో పేదరికం పోవాలి. స్వర్ణాంధ్రప్రదేశ్‌లో పేదరికం లేకుండా, ఆర్థిక అసమానతలు లేకుండా ఉండాలి. సంపాదనలో కొంత దేవుడుకి ఇచ్చి ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. మానవ సేవే..మాధవ సేవ. దేవునికి సేవ చేయడం అంటే మనతో ఉన్నవారిని సమానంగా పైకి తీసుకురావడం. శ్రీరాముడి స్ఫూర్తితో పేదలను ఆదుకునేందుకు ముందుకురావాలని కోరుతున్నా’ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos