ఏపీలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర జిల్లాల ఓటర్లు తమ చైతన్యం చూపించారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా పరిధిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ జరుగుతోంది. ఉద యం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ 4 గంటల వరకు కొనసాగింది. అయితే.. ఇక్కడ మధ్యాహ్నం 2 గంటల సమయానికే 86 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారులు ప్రకటించారు. 

ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగ్గురు కీలక వ్యక్తుల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. వీరిలో పాకాలపాటి రఘువర్మ ఏపీటీఎఫ్‌ తరఫున పోటీలో ఉన్నారు. అలానే.. మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు పీఆర్టీయూ తరఫున పోటీ చేస్తున్నారు. మరో ముఖ్య నాయకుడు కోరెడ్ల విజయగౌరి యూటీఎఫ్‌ నుంచి బరిలో ఉన్నారు. మరో ఏడుగురు స్వంతంత్రులుగా కూడా పోటీ చేస్తున్నా.. ప్రధాన పోటీ మాత్రం ఈ ముగ్గురి మధ్యే కొనసాగింది.

ఏపీటీఎఫ్ నుంచి బరిలో ఉన్న పాకాలపాటి రఘువర్మకు కూటమి పార్టీల్లో టీడీపీ, జనసేన మద్దతు ఇస్తున్నాయి. మరోవైపు.. ఇదే కూటమికి చెందిన బీజేపీ.. పీఆర్టీయూ నుంచి బరిలో ఉన్న గాదె శ్రీనివాసుల నాయుడుకు మద్దతు ప్రకటించింది. అయితే.. వైసీపీ ఇక్కడ ఎవరికీ మద్దతు ప్రకటించలేదు. ఇదిలావుంటే పోలింగ్ విషయానికి వస్తే.. టీడీపీకి చెందిన రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు సహా.. ఇతర నాయకులు ఉత్తరాంధ్రలోనే తిష్ఠ వేసి...కూటమి అభ్యర్థిగా ఉన్న రఘువర్మను గెలిపించాలని వారు విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో భారీ ఎత్తున ఓటింగ్ జరిగింది. ఇతర రెండు గ్రాడ్యుయేట్ స్థానాలతో పోల్చుకుంటే.. ఉత్తరాంధ్రలో మధ్యాహ్నం 2 గంటలకే 86 శాతం పోలింగ్ నమోదు కావడంతో కూటమి నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos