"మిమ్మల్ని చూస్తుంటే నా పాఠశాల రోజులు గుర్తొస్తున్నాయి. మాది క్లాసులో అల్లరి బ్యాచ్. మా టీచర్ ఎప్పుడూ అమ్మకు ఫిర్యాదు చేసేవారు. మా నాన్న నా పేరెంట్-టీచర్ మీటింగ్‌కు (పీటీఎం) ఎప్పుడూ రాలేదు. కానీ, ఈ రోజు మీ పీటీఎంకు ఏకంగా ముఖ్యమంత్రే వచ్చారు. ఈ విషయంలో మీరంతా చాలా అదృష్టవంతులు" అని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ భావోద్వేగంగా అన్నారు. ఎంత పని ఒత్తిడి ఉన్నా తాను తన కుమారుడు దేవాన్ష్ పీటీఎంకు తప్పకుండా వెళతానని తెలిపారు.

తన తండ్రి, ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంలోని భామిని ఏపీ మోడల్ స్కూల్‌లో నిర్వహించిన 'మెగా పీటీఎం 3.0' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. చదువు విలువను, తల్లిదండ్రుల త్యాగాన్ని విద్యార్థులకు అర్థమయ్యేలా మంత్రి లోకేశ్ .. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితంలోని ఒక ముఖ్య ఘట్టాన్ని వివరించారు.

"ఒకప్పుడు మన దేశాన్ని బ్రిటిష్ వారు పాలిస్తున్న రోజుల్లో, సుబ్బమ్మ అనే తల్లి తన కొడుకుని ఎంతో కష్టపడి చదివించింది. ఒకసారి కొడుకు ఫీజు కోసం మూడు రూపాయలు కట్టాల్సి రాగా, ఆమె వద్ద డబ్బులు లేవు. తన పుట్టింటి వారు ఇచ్చిన పట్టుచీరను తాకట్టు పెట్టి ఆ ఫీజు కట్టింది. తల్లి పడిన ఆ కష్టాన్ని చూసిన కొడుకు పట్టుదలతో చదివి బారిస్టర్ అయ్యారు. పత్రికా సంపాదకుడిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా బ్రిటిష్ వారిని ఎదిరించి నిలిచారు. స్వాతంత్య్రం వచ్చాక సమైక్య ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనే మన టంగుటూరి ప్రకాశం పంతులు గారు. తల్లిదండ్రుల త్యాగాల వల్లే మనం ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామని, వారి కలలను నిజం చేయాల్సిన బాధ్యత మీపై ఉందని" లోకేశ్ విద్యార్థులకు హితవు పలికారు.

విద్యావ్యవస్థను రాజకీయాలకు అతీతంగా తీర్చిదిద్దుతున్నామని లోకేశ్ స్పష్టం చేశారు. "పాఠశాలల్లో రాజకీయాలు ఉండకూడదన్నది మా ప్రభుత్వ విధానం. అందుకే ఇప్పుడు ఏ పాఠశాలలోనూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి లేదా నా ఫొటోలు కనిపించవు. పాఠశాల భవనాలకు పార్టీ రంగులు లేవు, రాజకీయ కార్యక్రమాలు లేవు. విద్యార్థులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరుతో స్టూడెంట్ కిట్స్, డొక్కా సీతమ్మ గారి పేరుతో సన్న బియ్యంతో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం" అని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని, వన్ క్లాస్ - వన్ టీచర్ విధానం, క్లిక్కర్ టెక్నాలజీ, పారదర్శక ఉపాధ్యాయ బదిలీలు, పాఠశాలలకు స్టార్ రేటింగ్స్ వంటివి అమలు చేస్తున్నామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, క్వాలిఫైడ్ టీచర్లు, ఉచిత పుస్తకాలు, యూనిఫాంలతో పాటు ఆటలు, యోగా వంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, ఏపీ ప్రజలు గర్వపడేలా విద్యావ్యవస్థను తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos