ఏపీలో తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేంద్రంగా జరుగుతున్న ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వానికి చెక్ పెట్టే లక్ష్యంతో ఇవాళ అసెంబ్లీలో చంద్రబాబు ప్రభుత్వం సుదీర్ఘ చర్చ చేపట్టింది. ఇందులో మాట్లాడిన సీఎం చంద్రబాబు వైసీపీ చేస్తున్న పలు ఆరోపణలకు కౌంటర్ ఇస్తున్నారు. ఇదే క్రమంలో హెరిటేజ్ నెయ్యిని టీటీడీ కొనుగోలు చేసిందంటూ వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు. మీ భారతీ సిమెంట్ నే ప్రభుత్వ పనులకు సరఫరా చేశారంటూ జగన్ కు కౌంటర్ ఇచ్చారు. హెరిటేజ్ తన కుటుంబ వ్యాపార సంస్థ అని, ప్రభుత్వంలో ఎక్కడా దాని ఉత్పత్తులు సరఫరా చేయలేదని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇప్పటి వరకూ హెరిటేజ్ నుంచి ఒక్క కేజీ నెయ్యిని కూడా ప్రభుత్వ శాఖలు కొనుగోలు చేయలేదన్నారు. కానీ వాళ్ల పత్రికలో ఈ సంస్థపై వ్యతిరేక కథనాలు రాశారన్నారు. ప్రభుత్వ సహకారం లేకుండా నీతి నిజాయతీతో హెరిటేజ్ నిలబడిందని గుర్తుచేశారు. అదే సమయంలో భారతీ సిమెంట్స్ నుంచి కొన్న సిమెంట్ ను ప్రభుత్వ హౌసింగ్ పథకాలు, ప్రాజెక్టుల్లో వినియోగించారని ఆరోపించారు.

నెయ్యి వ్యవహారాన్ని హెరిటేజ్ డెయిరీకీ ముడిపెట్టే ప్రయత్నం చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఇందాపూర్ డెయిరీకి హెరిటేజ్ కు నెయ్యి విషయంలో సంబంధం లేదన్నారు. పూణేలో ఉన్న ఇందాపూర్ డెయిరీ ప్రసిద్ధ కంపెనీలన్నిటికీ కో మాన్యుఫాక్చరింగ్ చేస్తోందని తెలిపారు. మదర్ డెయిరీ, బ్రిటానియా, ఆయుర్వేద ఘీ పతంజలి, డిమార్ట్, రిలయన్స్, దొడ్ల, హాడ్సన్ , జీఆర్బీ, అముల్, హెరిటేజ్ లాంటి సంస్థలకు ఉత్పత్తులు సరఫరా చేస్తున్నారన్నారు. కో మాన్యు ఫాక్చరింగ్ చేస్తున్న ఇందాపూర్ డెయిరీ పై ఆరోపణలు చేస్తున్నారన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos