ఏపీలో గత వైసీపీ హయాంలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఆరుగురు గతేడాది కూటమి సర్కార్ వచ్చాక అధికార పార్టీల్లోకి ఫిరాయించారు. అదే సమయంలో రాజీనామాలు కూడా చేశారు. ఈ మేరకు లేఖల్ని మండలి ఛైర్మన్ కొయ్యే మోషేను రాజుకు పంపారు. అయితే ఆ రాజీనామాలు ఇప్పటివరకూ ఆమోదం పొందలేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీలు హైకోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో వీరి రాజీనామాలపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇవాళ .. గతంలో రాజీనామాలు చేసిన ఆరుగురు వైసీపీ ఎమ్మెల్సీలను మండలి ఛైర్మన్ పిలిపించి .. రాజీనామాలకు కట్టుబడే విషయంలో వారి అభిప్రాయాలు తెలుసుకోవాలని భావించారు. దీంతో ఆయా ఎమ్మెల్సీలు ఇవాళ మండలికి వచ్చారు. ఈ సందర్భంగా మండలి ఛైర్మన్ మోషేను రాజుకు, ఎమ్మెల్సీలకు మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. తాము రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చిందో, ఎందుకు పార్టీ మారానుకుంటున్నామో ఆయనకు వారు వివరించారు. వైసీపీలో ఉండలేక రాజీనామా చేశామని చాలాసార్లు చెప్పినట్లు ఆరుగురు ఎమ్మెల్సీలు మండలి ఛైర్మన్ కు తెలిపారు. ప్రలోభాలకు లోనై రాజీనామాలు చేశారా అని ఎమ్మెల్సీలను మండలి ఛైర్మన్‌ మోషేన్‌రాజు ఈ సందర్భంగా ప్రశ్నించగా.. దీనికి స్పందనగా వారు.. జగన్‌ ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చకే స్వచ్ఛందంగా రాజీనామాలు చేశామని తెలిపారు. పదవీకాలం తక్కువే ఉన్నందున కొనసాగాలని మండలి ఛైర్మన్‌ వారికి సూచించారు.

రాజీనామాల ఉపసంహరణ విషయంలో పునరాలోచన ఏమైనా ఉందా అని కూడా ఛైర్మన్‌ వారిని అడిగారు. జగన్‌ వద్ద, వైసీపీలో కొనసాగే ఉద్దేశం లేకే రాజీనామాలు చేసినట్లు ఎమ్మెల్సీలు వెల్లడించారు. దీంతో ఆయన కూడా చేసేది లేక ఈ విచారణ ముగించినట్లు తెలుస్తోంది. త్వరలో వీరి రాజీనామాల ఆమోదంపై ఛైర్మన్ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. రాజీనామాలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీల్లో కర్రి పద్మశ్రీ, కళ్యాణ చక్రవర్తి, మర్రి రాజశేఖర్‌తో పాటు జయమంగళ వెంకటరమణ, జాకియా ఖానం, పోతుల సునీత ఉన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos