విజయవాడ : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయసాధనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయ( సుజనా చౌదరి) అన్నారు. భవానిపురం, 41 వ డివిజన్ అంబేద్కర్ సొసైటీ సెక్రెటరీ పెరికల నాగభూషణం ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేడ్కర్ 134వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి ముఖ్యఅతిథిగా పాల్గొని కూటమి నేతలతో కలిసి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడుగు, బలహీన, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి అందరికి సమాన హక్కులు కల్పించిన మహోన్నత వ్యక్తి అంబేడ్కర్ అని కీర్తించారు. దేశంలో నేడు అన్ని వ్యవస్థలు, క్రమ పద్ధతిలో నడుస్తున్నాయంటే దానికి డా.బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగమే కారణమని తెలిపారు. భారతదేశాన్ని ప్రపంచానికి చాటిన అతి కొద్దిమందిలో అంబేడ్కర్ ఒకరని తెలిపారు. ఆయన చదువుకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని, ఎన్నో కష్టాలు ఎదురైనా ఎంతో పట్టుదలగా చదువుకున్నారని, ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతీ ఒక్కరు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలన్నారు.
అనంతరం మాలపల్లి లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సుజనా మిత్ర ఏర్పాటు చేశామన్నారు. డివిజన్లలోని సమస్యలను వారికి తెలపాలని సూచించారు. పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనబడుతుంది..
పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి జరగడంలేదని మాజీ ఎమ్మెల్యే వేలంపల్లి శ్రీనివాసరావు విమర్శించారని విలేకరి ప్రశ్నించగా పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనబడుతుందని సుజనా ఎద్దేవా చేశారు. వేలంపల్లి శ్రీనివాస్ కు అభివృద్ధి కళ్ళకు గంతలు కట్టే ప్రయత్నం మానుకోవాలని సూచించారు. నియోజకవర్గంలో పర్యటించి పశ్చిమ అభివృద్ధిని చూడాలని సుజనా చౌదరి వెల్లంపల్లి కి సలహా ఇచ్చారు.
ఐక్యంగా ముందుకు వెళ్దాం...
నియోజకవర్గ అభివృద్ధికి ఐక్యంగా ముందుకు వెళ్దామని ఎమ్మెల్యే సుజనా చౌదరి పిలుపునిచ్చారు. తనకు అత్యధిక మెజారిటీ ఇచ్చిన పశ్చిమ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తన పాలన ఉంటుందన్నారు. ఓటు వేయని వారికి కూడా సంక్షేమం అందాలనేదే తన అభిమతం అన్నారు.
మాజీ ఎమ్మెల్యే వైసీపీ కార్పొరేటర్లు లేనిపోని విమర్శలు మాని అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే కోరారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos