ఏపీలో నారా లోకేష్ డిప్యూటీ సీఎం ప్రచారాన్ని తెరపైకి తెచ్చి కొన్ని రోజుల పాటు రచ్చ రచ్చ చేసిన టీడీపీ నేతలు తాజాగా అధిష్టానం ఆదేశాలతో శాంతించారు. అలా కనిపిస్తున్నారు కానీ శాంతించలేదు. ఇప్పుడు ఏకంగా నారా లోకేష్ ప్రధాని ఎందుకు కాకూడదంటూ టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే కుమారుడు ఒకరు ప్రశ్నిస్తున్నారు. దీంతో టీడీపీతో పాటు అన్ని పార్టీల్లోనూ కలకలం రేగుతోంది. టీడీపీలో గతంలో మంత్రిగా పనిచేసి,ఇప్పుడు భీమిలి నుంచి ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా రవితేజ ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ అన్నయ్య ప్రధాని ఎందుకు అవ్వకూడదని ఆయన ప్రశ్నించారు. నారా లోకేష్ నాలాంటి ఎంతో మంది యువతకు స్పూర్తి అన్నారు. ఏపీలో లోకేష్ గేమ్ ఛేంజర్ అవుతారని అనుకోలేదని రవితేజ తెలిపారు. రాబోయే రోజుల్లో నారా లోకేష్ లాంటి రాజకీయ నాయకుడు మనకు చాలా అవసరం అంటూ వ్యాఖ్యానించారు. అందరూ డిప్యూటీ సీఎం అంటున్నారు కానీ అన్నయ్య (నారా లోకేష్ ) ప్రధాన మంత్రి కావాలంటూ రవితేజ వెల్లడించారు. ఏదో ఒకరోజు లోకేష్ ను ప్రధాన మంత్రిగా చూడాలని తన కోరిక అని ఆయన అన్నారు.

రాష్ట్రంలో ఇప్పటికే నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్లను టీడీపీ నేతలు తెరపైకి తెస్తున్నారు. దీనికి కౌంటర్ గా పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేయాలంటూ జనసేన కౌంటర్ ఇస్తోంది. అదే సమయంలో దావోస్ టూర్ లోనే ఏకంగా మంత్రి టీజీ భరత్ లోకేష్ భవిష్యత్ సీఎం అంటూ కామెంట్ చేసి చంద్రబాబుతో తిట్లు తిన్నారు. ఇప్పుడు గంటా శ్రీనివాస్ కుమారుడు.. లోకేష్ ఏకంగా ప్రధాని కావాలంటూ చేసిన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వంగా చేశారా లేక ప్రచారం కోసం చేశారా అన్నది అర్దం కావడం లేదని టీడీపీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. ఏదేమైనా లోకేష్ కేంద్రంగా వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలవాలన్న టీడీపీ నేతల ఆరాటం మాత్రం ఏదో విధంగా బయటపడుతూనే ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos