ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీల్లో పారదర్శకత ఉండేలా చర్యలు చేపడుతున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అసెంబ్లీలో వెల్లడించారు. టీచర్ల సీనియారిటీ జాబితా ప్రకటిస్తామని, బదిలీలకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామని మంత్రి తెలిపారు.  బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంత్రి నారా లోకేశ్ శుక్రవారం అసెంబ్లీలో ప్రసంగించారు. విద్యావ్యవస్థలో టీచర్లది ప్రధాన పాత్ర అని, వారిపై భారం మోపితే విద్యార్థులకు సరిగా పాఠాలు చెప్పలేరని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై మంత్రి లోకేశ్ విమర్శలు గుప్పించారు. ఐబీ స్కూళ్లు ఏర్పాటు చేస్తామని ప్రగల్బాలు పలికిందని గత వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. స్కూళ్ల ఏర్పాటుకు సంబంధించి నివేదిక కోసమే రూ.5 కోట్లు ఖర్చు చేసిందని ఫైర్ అయ్యారు.  డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తే చాలు కేసులు పడేవని, దీంతో ఆ నోటిఫికేషన్ ఎటూ తేలేది కాదని అన్నారు. ఈ క్రమంలో లోటుపాట్లను సరిచేసి, ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేకుండా త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల  చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై ఉపాధ్యాయ సంఘాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు మంత్రి వివరించారు. జీవో నెం.117ను రద్దు చేసి ప్రత్యామ్నాయ జీవో తీసుకొస్తామని మంత్రి నారా లోకేశ్ చెప్పారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos