ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని అమరాతి పునఃనిర్మాణ పనులను పరుగులు పెట్టించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. తాజాగా మంత్రి నారాయణ మాట్లాడుతూ... మూడేళ్లలో అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. న్యాయపరమైన ఇబ్బందుల కారణంగా పనుల ప్రారంభం ఆలస్యమయిందని తెలిపారు.

మంత్రి నారాయణ ఈరోజు రాజధాని ప్రాంతంలో పర్యటించారు. నేలపాడు సమీపంలోని అడ్మినిస్ట్రేటివ్ టవర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు 40 పనులకు టెండర్లను పిలిచామని నారాయణ తెలిపారు. అమరావతిని ప్రపంచ టాప్ 5 నగరాల్లో ఒకటిగా చేయాలనే లక్ష్యంతో ఐకానిక్ భవనాల నిర్మాణానికి నార్మన్ ఫోస్టర్ చేత డిజైన్ చేయించామని వెల్లడించారు.

2019కి ముందే టీడీపీ హయాంలో జడ్జిలు, అధికారులు, ఉద్యోగుల కోసం మొత్తం 4,053 ఫ్లాట్ లతో అపార్ట్ మెంట్ల పనులు ప్రారంభించామని మంత్రి నారాయణ తెలిపారు. అసెంబ్లీని 250 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తామని... సమావేశాలు లేని రోజుల్లో దాన్ని టూరిజం స్పాట్ గా మార్చేలా డిజైన్లు రూపొందించామని చెప్పారు. తాగునీటి పైపులు, విద్యుత్ లైన్లు, డ్రైనేజీలు అండర్ గ్రౌండ్ లో ఉండేలా చేస్తున్నామని నారాయణ తెలిపారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos