ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేసారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి - పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. పోలవరం తొలి దశ పూర్తి చేసేందుకు కేంద్రం పూర్తిగా ఆర్దిక సాయం ప్రకటించింది. అమరావతికి ప్రపంచ బ్యాంకు రుణం తో పాటుగా హడ్కో రుణాలతో నిర్మాణాలు తిరిగి మొదలు పెడుతున్నారు. ఇక, ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ప్రాజెక్టుకి భూములు ఇచ్చిన రైతులకు తొలుత తక్కువ పరిహారం ఇచ్చారని పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితం వరకు నిర్వాసితులను పట్టించుకోలేదని చెప్పుకొచ్చారు. 2014లో ఎన్నికల్లో గెలిచిన సమయం లో పోలవరం పూర్తి కోసం ఏడు మండలాలు ఏపీలో కలపాలని అప్పట్లో మోదీని డిమాండ్ చేశానని గుర్తు చేశారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 10 లక్షలు పరిహారం ఇస్తానని చెప్పి.. అధికారం లోకి వచ్చిన తరువాత పైసా కూడా ఇవ్వలేదని చంద్రబాబు పేర్కొన్నారు.

పోలవరం ప్రాంతంలో వరదలు వచ్చినప్పుడు కూడా అప్పటి సీఎం జగన్ పట్టించుకోలేదని ...ఎప్పుడో పూర్తి కావాల్సిన ప్రాజెక్టును జగన్ విస్మరించారని సీఎం చంద్రబాబు విమర్శించారు. 2019 ఎన్నికల్లోనూ టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే పోలవరం ఇప్పటికే పూర్తయ్యేదని చెప్పుకొచ్చారు. జగన్ కారణంగా ప్రాజెక్టు ఆలస్యం కావటంతో పాటుగా భారీగా నిర్మాణ ఖర్చు పెరిగిందని వివరించారు. తాను సోమవారాన్ని పోలవరంగా మార్చుకుని పని చేశానని, ఐదేళ్లలో 33 సార్లు పోలవరాన్ని సందర్శిం చానని చెప్పుకొచ్చారు. పరిహారం వీలైనంత త్వరగా చెల్లించే ప్రయత్నం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కొందరి పేర్లు తొలగించారని బాధితులు చెబుతున్నారని, పేర్ల తొలగింపుపై విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

2027 నాటికి పునరావాసాలు పూర్తి చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. పునరావాసాలు ఇచ్చిన తర్వాతే ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. దళారులు, మోసగాళ్లకు అవకాశం లేకుండా చేస్తామన్నారు. పోలవరంలో నీళ్లు వదిలే ముందే పునరావసం పూర్తి చేస్తామన్నారు. మన ఎన్డీయే ప్రభుత్వం వచ్చిందని, సకాలంలో ప్రాజెక్టు పూర్తి చేసుకుందామని అన్నారు. 829 కోట్లు నేరుగా నిర్వాసితుల ఖాతాల్లోకి వేసిన కూటమి ప్రభుత్వానిదేనని చంద్రబాబు స్పష్టంచేశారు. ఇళ్ల నిర్మాణంలోనూ 75 వేలు గిరిజనులకు అదనంగా ఇస్తున్నామన్నారు. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వమని, బాధితులపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని చంద్రబాబు వెల్లడించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos