ఏపీ రాజకీయాల్లో కడప రాజకీయాలే వేరు. ఇక్కడ ఏం జరిగినా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో కడపలో ఒకప్పుడు వైసీపీ తరఫున గెలిచి ఆ తర్వాత పార్టీని వీడి టీడీపీలో చేరి ప్రత్యర్ధిగా మారి ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆదినారాయణరెడ్డి ఈ మధ్య వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. కడప జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీల వ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానంగా వైసీపీని తెరపైకి తెచ్చిన ఆదినారాయణరెడ్డి ఇవాళ తన మాటల దాడిని మరింత పెంచారు. వైసీపీ సిమెంట్ ఫ్యాక్టరీల అరాచకాలను తాను అడ్డుకుంటున్నట్లు చెబుతున్న ఆదినారాయణరెడ్డి ఇవాళ మరోసారి ఇదే విషయంపై ప్రెస్ మీట్ పెట్టారు. ఇందులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు ఆయన నేరుగా వార్నింగ్ ఇచ్చారు. వైఎస్ జగన్ ను రాజకీయాల్లో లేకుండా చేస్తామంటూ ఆదినారాయణరెడ్డి హెచ్చరించారు. సిమెంట్ పరిశ్రమల నంచి వైసీపీ నేతలు లబ్ది పొందుతున్నారని, వైసీపీ త్వరలోనే కుప్పకూలిపోతుందంటూ ఆది తెలిపారు. జమ్మూ కాశ్మీర్ లోని ఉగ్రవాదుల కంటే ఇక్కడున్న వైసీపీ వాళ్లు డేంజర్ అని అన్నారు. వైసీపీకి ఈసారి 11 సీట్లు కూడా రావని, జగన్ కోరికలేవీ నెరవేరవని ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు. లిక్కర్ కేసులో కసిరెడ్డి దొరికాడని, జగన్ సహా అందరి బండారం బయటపడుతుందన్నారు. చెట్టే రాలిపోతుంటే ఇక ఆకులు, ఈకలు ఏం ఉంటాయంటూ ఆదినారాయణరెడ్డి వైసీపీపై విమర్శలు గుప్పించారు.

గత ఎన్నికల్లో బీజేపీ నుంచి జమ్మలమడుగు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన ఆదినారాయణరెడ్డి జిల్లాపై పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో పొరుగున ఉన్న అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ కుటుంబానికి చెందిన ట్రక్కుల్ని కూడా అడ్డుకున్నారు. ఈ వివాదం సీఎం చంద్రబాబు దగ్గరకు వెళ్లింది. దీంతో ఇరువర్గాల్ని పిలిచి రాజీ చేశారు. అయితే ఆ తర్వాత కడప జిల్లాలో సీమెంట్ ఫ్యాక్టరీలను టార్గెట్ చేస్తూ ఆదినారాయణరెడ్డి చేస్తున్న రచ్చపై చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారు. అయితే ఇదంతా వైసీపీపై పోరాటమే అంటూ ఆది చెప్పుకుంటున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos