అమరావతిలో ప్రధాని పర్యటనకు సర్వం సిద్దమైంది. అమరావతి పనుల రీ లాంచ్ కోసం ప్రధాని వస్తున్న వేళ భారీ ఏర్పాట్లు చేసారు. ప్రభుత్వం ఈ పర్యటనను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇందు కోసం దాదాపు అయిదు లక్షల మంది హాజరవుతారన్న అంచనాతో సభ ఏర్పాటు చేశారు. పలువురు ప్రముఖులను ప్రభుత్వం ఆహ్వానించింది. ఇదే సమయంలో అమరావతి భవిష్యత్ తో పాటుగా లక్ష్యాలు.. భూముల ధరల పైన చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ప్రతీ ఒక్కరూ అమరావతి గురించి గర్వంగా చెప్పుకునేలా తీర్చి దిద్దుతామని చంద్రబాబు వెల్లడించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నెల్లూరు జిల్లాలో పర్యటించారు. జిల్లాలో ఎంఎస్‌ఎంఈ పార్కును ప్రారంభించారు. వర్చువల్‌గా 11 ఎంఎస్‌ఎంఈ పార్కులను సీఎం ప్రారంభించారు. 14 ఎఫ్‌ఎఫ్‌సీలు, 25 ఎంఎస్‌ఎంఈ పార్కులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఏపీలో అసంఘటిత కార్మికులు అధికంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. వారందరినీ ఆదుకోవడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఇసుక దోపిడీ చేశారని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఇసుక ఉచితం చేశామని... భవన నిర్మాణ కార్మికుల పనుల కోసం భవన అనుమతులు తేలికగా పొందే వీలు కల్పించామన్నారు. నారంపేట ఎంఎస్‌ఎంఈ పార్కులో నేరుగా పరిశ్రమ ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. షెడ్లు, కరెంటు అందుబాటులో ఉంటాయని. కామన్, మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు.

34వేల ఎకరాల్లో అమరావతిని నిర్మించి అక్కడి వారిని కోటీశ్వరులని చేయాలనుకున్నామన్నారు చంద్రబాబు. 29 వేల మంది రైతులు భూములిచ్చారని.. ఎక్కడా రైతుకి అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రతీ ఒక్కరూ అమరావతి తమ రాజధాని అని గర్వంగా చెప్పుకునేలా నిర్మాణాలు జరుగుతాయని వెల్లడించారు. 
అమరావతిలో భూములు ఇచ్చిన రైతులకు రిటర్న్ ప్లాట్లు ఇస్తామని ..భూముల ధరలు పెరుగుతున్నాయని చంద్రబాబు వివరించారు. అమరావతి నుంచి దేశంలోని అన్ని ప్రధాన ప్రాంతాలకు కనెక్టివిటీ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఇక, ఏపీలో 175 ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. నారంపేట పార్కు వల్ల ఎన్నో కుటుంబాలు ఆర్ధికంగా ఎదుగుతాయన్నారు. 50 ఎంఎస్‌ఎంఈ పార్కులను ఇక్కడి నుంచే ప్రారంభించామని.. మండలానికో ఎంఎస్‌ఎంఈ పార్కు తీసుకురావాలన్నది తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

ఏపీకి పెద్ద సంఖ్యలో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ ప్రభుత్వంపై నమ్మకం ఉందని... భవిష్యత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే అని చెప్పుకొచ్చారు. వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, అనంతపురం కేంద్రంగా అయిదు రీజనల్ హబ్‌లు పెడుతున్నామన్నారు. పరిశ్రమలను విద్యాసంస్థలను అనుసంధానం చేయబోతున్నామన్నారు. యువత అందరికీ మంచి ఆలోచనలు ఉన్నాయన్నారు. ఉద్యోగం పొందడం కాదని, ఉద్యోగాలిచ్చే స్థాయిలో ఉండాలని సూచించారు. ఐటీ వల్ల ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా మన తెలుగు బిడ్డలు ఉన్నారని... ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలని సీఎం ఆకాంక్షించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos