రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉన్న ఖాళీలను యుద్ధప్రాతిపదికన భర్తీ చేస్తామని, ప్రైవేటు కాలేజీలకు ధీటుగా వాటిని తీర్చిదిద్దుతామని ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. ఇవాళ మంగళవారం శాసనమండలిలో అనంతపురం జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల మంజూరుపై సభ్యుడు ఎ.శివరామిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.  ప్రభుత్వ విద్యావ్యవస్థ బలోపేతానికి కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్‌ ఇంకా మాట్లాడుతూ... ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొత్తగా 9 ప్రభుత్వ జూనియర్ కళాశాలలను మంజూరు చేసినట్టు చెప్పారు. వీటిలో అన్నింటికీ బోధన సిబ్బంది, 5 కళాశాలలకు బోధనేతర సిబ్బంది పోస్టులను కూడా మంజూరు చేశామని వివరించారు. అయితే, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యాశాఖ తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని ఆయన విమర్శించారు. "నేను విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు, ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో, ఏ ఉపాధ్యాయుడు ఎక్కడ పనిచేస్తున్నారో కూడా సరైన డేటా లేదు. ఆ సమాచారాన్ని సేకరించడానికే నాకు 20 నెలల సమయం పట్టింది" అని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల అభివృద్ధికి తమ ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్తోందని మంత్రి తెలిపారు. "ప్రైవేటు కాలేజీలకు దీటుగా ప్రభుత్వ కాలేజీలను తీర్చిదిద్దడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందుకు అవసరమైన అధ్యాపకులను నియమిస్తాం. ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తాం. పోటీ పరీక్షలకు అవసరమైన మెటీరియల్ కూడా అందిస్తాం" అని ఆయన హామీ ఇచ్చారు. అలాగే ఇంటర్మీడియట్ విద్యలో మధ్యాహ్న భోజన పథకాన్ని తిరిగి ప్రారంభించామని, విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలను ఉచితంగా అందిస్తున్నామని లోకేశ్‌ పేర్కొన్నారు. జూనియర్ కాలేజీల్లో ఖాళీల భర్తీ ప్రక్రియను అత్యంత వేగంగా పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన మండలికి హామీ ఇచ్చారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos