తిరుమల లడ్డూలో 2019-24 మధ్య పెద్దఎత్తున కల్తీ జరిగిన మాట వాస్తవమని ఏపీ మంత్రి నారా లోకేష్ చెప్పారు. ముంబయిలో  ఐడియాస్ ఆఫ్ ఇండియా -2026 పేరిట జరిగిన సదస్సులో మాట్లాడిన లోకేష్  తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వివిధరకాల కెమికల్ కాంపౌండ్స్ వినియోగించారన్నారు. కల్తీ కారకులపై  కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సిట్ నివేదిక ప్రకారం టీటీడీ మాజీ  చైర్మన్ తో సహా ఏ ఒక్కరూ చట్టం నుంచి తప్పించుకోలేరని చెప్పారు.  ఇక తన రెడ్ బుక్ పై అడిగిన ప్రశ్నకు నారా లోకేష్ మాట్లాడుతూ... జగన్ ఐదేళ్ల పాలనలో  తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ప్రజలపై తప్పుడు కేసులు పెట్టి వేధించారని, అలా చేసిన వారి పేర్లు రెడ్ బుక్ లో ఉంటాయని అన్నారు. లా బ్రేక్ చేసినవాళ్లు, అందుకు ప్రేరేపించిన రాజకీయనాయకులు, టార్చర్ చేసినవాళ్ల పేర్లు అన్నీ ఉంటాయి. ఇక రెడ్ బుక్ లో  జగన్ పేరు ఉందో, లేదో త్వరలో తెలుస్తుందని లోకేష్ చెప్పారు. సీఎం చంద్రబాబునాయుడు టఫ్ టాస్క్‌మాస్టర్,   ఆయన ఇచ్చిన టాస్క్ పూర్తి చేయడమే మా పని అని  లోకేష్ అన్నారు. చంద్రబాబు నాయుడు 75 ఏళ్ల యంగ్ మ్యాన్. ఆయన ఇప్పటికీ పాతికేళ్ల యువకుడిలా పనిచేస్తారన్నారు. క్వాంటమ్ వ్యాలీపై మొదటిసారి నన్ను మీటింగ్‌కు పిలిచి దాని గురించి అడిగారు. నేను సెల్ ఫోన్ లో టేబుల్ కింద చాట్‌ జీపీటీలో సెర్చ్ చేస్తున్నాను, క్వాంటమ్ కంప్యూటింగ్ మీద వన్-పేజ్ నోట్ ఇవ్వాలని కోరారు. స్టాన్‌ఫోర్డ్ లో ఎంబీఏ చదివినా నాకు దానిపై అవగాహన లేదు. కానీ చంద్రబాబు నాయుడుకు ఉంది.ఆయన ఆలోచనలను అందుకోవడం చాలాకష్టమని లోకేష్ అన్నారు.  11 ఏళ్ల లోపు చిన్నారులకు సోషల్ మీడియా అందుబాటులో ఉండకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. 16 ఏళ్ల లోపువారికి ఏజ్-అప్రొప్రియేట్ కంటెంట్ మాత్రమే డిసెమినేట్ అవ్వాలి. ఇప్పుడు ప్రాపర్ ఫ్రేమ్‌వర్క్ లేకపోవడం వల్ల దీనిని అమలుచేసేందుకు సవాళ్లు ఎదురవుతున్నాయి. దీనిపై మేము పేరెంట్స్‌, ప్లాట్‌ఫామ్ ప్లేయర్స్‌తో మాట్లాడుతున్నాము.   దీనిపై మేం చేస్తున్న కసరత్తు 90 రోజుల్లో పూర్తవుతుందని లోకేష్ చెప్పారు. 

Related Videos