పైరవీలకు అతీతంగా పారదర్శకంగా ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ పనిచేస్తుందని రెరా ఛైర్మన్ శివారెడ్డి తెలిపారు. లబ్ధిదారులు ఎవరైనా నష్టపోతే అలాంటి వారి ఫిర్యాదులు పరిశీలించి సత్వర న్యాయం చేస్తామని ఆయన చెప్పారు. రేరా కార్యాలయాన్ని విజయవాడ నుంచి అమరావతి లోని సీఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయం వద్దకు మార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల రాజధాని అమరావతిలో స్థలం ఇచ్చి ఇక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహించాలని ప్రభుత్వం సూచించినట్లు తెలిపారు.

స్టేక్ హోల్డర్స్ అందరికీ ఈ ప్రభుత్వం ఫ్రెండ్లీగా వ్యవహరిస్తోందని, వారు అన్ని సంబంధిత ఫారాలతో దరఖాస్తు చేసుకున్న పక్షంలో.. వారికి వెంటనే నంబరింగ్ ఇస్తున్నామని ఆయన అన్నారు. ఎవరికైనా న్యాయం జరగకుంటే అలాంటివారు ఫిర్యాదులు చేసిన పక్షంలో..  అలాంటి వారికి అథారిటీ ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్ బెంచ్ సమస్యల పరిష్కార దిశగా ఆర్డర్స్ ఇస్తున్నదని ఆయన అన్నారు. అథారిటీ యాక్ట్ ప్రకారం ప్రమోషన్లలో భాగంగా ఈ నెల పదో తేదీ నుంచి ప్రతి నెలా ఒక జిల్లాను ఎంపిక చేసుకుని పాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలలో ఒక్కొక్క నెల ఒక్కొక్క జిల్లాకు వెళ్లి అక్కడ ఉన్న స్టేక్ హోల్డర్స్ ను సమావేశపరిచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ను నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. మొట్టమొదట శ్రీవారి పాదాల చెంత ఉన్న తిరుపతిలో పదో తేదీన ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైనా సరే ఒక డెవలపర్ దగ్గర కానీ ఒక బిల్డర్ దగ్గర గానీ మోసపోయామని కంప్లైంట్ చేస్తే.. రెగ్యులేటరీ అథారిటీ కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. 

 అమరావతి లో రెగ్యులర్ అథారిటీకి ఆఫీస్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, కొత్త రాజధానిలో పని చెయ్యడానికి నన్ను నియమించినందుకు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని చైర్మన్ శివారెడ్డి చెప్పారు. మా ఆధారిటిలో ఉన్న సభ్యులందరం కలిసి అమరావతి డెవలప్ మెంట్ కోసం కృషి చేస్తామని అన్నారు. మా రెగ్యులేటరీ అథారిటీలో ఇంజనీర్స్, లాయర్స్, డాక్టర్స్ సభ్యులుగా ఉన్నారని అన్నారు. మా అథారిటీతో అనుబంధం ఉన్న అన్ని బిల్డర్స్, డెవలపర్స్ అందరూ కూడా రెగ్యులేటర్ ఆధారీటీలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos