తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ స్వల్పంగా గాయపడ్డారు. ఇవాళ ఆయన హైదరాబాద్ లోని ఒక జిమ్ లో వ్యాయామం చేస్తుండగా గాయపడ్డారు. ఇదే విషయాన్ని కేటీఆర్ స్వయంగా తన సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా తెలియజేశారు. జిమ్ లో వర్కవుట్ చేస్తూ పడడంతో తనకు గాయాలయ్యాయని, వైద్యులు కొద్దిరోజుల పాటు తనను విశ్రాంతి తీసుకోవాలని సూచించారని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం తాను వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నానని కేటీఆర్ తన పోస్టులో వివరించారు. ఈ గాయం నుంచి కోలుకొని వీలైనంత త్వరగా రోజువారీ కార్యక్రమాలలో పాల్గొంటానని ఆయన తన పోస్టు ద్వారా ఆశాభావం వ్యక్తం చేశారు.
కేటీఆర్ గాయపడిన విషయం తెలుసుకున్న పలువురు రాజకీయ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు, అభిమానులు కేటీఆర్ త్వరగా కోలుకోవాలని పోస్టులు పెడుతున్నారు. ఇక కేటీఆర్ జిమ్ లో వర్కౌట్ చేస్తూ గాయపడిన క్రమంలో కేటీఆర్ చేసిన ట్వీట్ కు పవన్ కళ్యాణ్ స్పందించారు. కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.ఇక మరోవైపు వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కేటీఆర్ కు గాయం కావడం పైన స్పందించారు. ట్విట్టర్ వేదికగా బ్రదర్ కేటీఆర్ అంటూ పోస్ట్ చేసిన వైయస్ జగన్... మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అంటూ పేర్కొన్నారు. ఇక మరోవైపు కేటీఆర్ త్వరగా కోలుకోవాలని నారా లోకేష్ సైతం ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆత్మీయులు కేటీఆర్ జిమ్ లో ఎక్సర్సైజ్ చేస్తుండగా గాయమైందని తెలిసి బాధపడ్డానని పేర్కొన్న నారా లోకేష్ .. వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos