లిక్కర్ స్కామ్‌పై మాట్లాడిన వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడే స్కామ్ చేసి ఇప్పుడు తమపై బురదజల్లుతున్నారని ఆరోపించారు. వ్యవస్థలను మేనేజ్ చేసి ప్రశ్నించే వారిని జైల్లో పెడుతున్నారని, అందులో భాగంగానే లిక్కర్ స్కామ్‌ తెరపైకి తీసుకొచ్చారని అన్నారు. ఉన్న సమస్యల నుంచి, సూపర్ సిక్స్ హామీల నుంచి దృష్టి మరల్చేందుకే ఈ పన్నాగమని అన్నారు. వైసీపీ పాలనలో లిక్కర్ అమ్మకాలు తగ్గించామని,  అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా లేకుంటే అమ్మకాలు పెంచితే లంచాలు ఇస్తారా అని ప్రశ్నించారు. చంద్రబాబు 2014 నుంచి 2019 వరకు చేసిందే అసలైన స్కామ్ అని అన్నారు. అందుకే అప్పట్లోనే కేసు నమోదు అయిందన్నారు. ఇప్పుడు ఆ కేసులో చంద్రబాబు బెయిల్‌పై ఉన్నారని గుర్తు చేశారు. తనపై ఉన్న కేసు లాంటిదే ఇప్పుడు తమపై కేసులు పెడుతున్నారని అన్నారు. దాన్ని బలహీనపరిచేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి స్కామ్ జరగపోయినా జరిగినట్టు మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.

వైసీపీ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 33 శాతం దుకాణాలు తగ్గించామని గుర్తు చేశారు జగన్. అమ్మకాలు కూడా భారీగా పడిపోయాయని తెలిపారు. తమ హయాంలో ఒక్క మద్యం కంపెనీకి కూడా లైసెన్స్‌ ఇవ్వలేదని వివరించారు. ట్యాక్స్‌లు కూడా పెంచినట్టు పేర్కొన్నారు. ఇలాంటివి చేస్తే ఎవరైనా లంచాలు ఇస్తారా అని ప్రశ్నించారు. ఇక్కడ కంపెనీలకు లాభాలు తగ్గించడమే కాకుండా ప్రజలకు మేలు చేశామని అన్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాలు పెట్టి క్యూఆర్‌ కోడ్‌ విధానం అమలు చేసి ఎలాంటి అక్రమాలు జరగకుండా అమ్మకాలు చేశామన్నారు. చంద్రబాబుకు లొంగిపోయిన విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తుల మాటకు ఎక్క విలువ ఉంటుందని ప్రశ్నించారు జగన్. కూటమికి మేలు చేసేలా తన రాజ్యసభ సీటుకు రాజీనామా చేశారని, చంద్రబాబు చేసిన ప్రలోభాలకు విజయసాయిరెడ్డి లొంగిపోయారని ఆరోపించారు. అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్‌మెంట్‌కు ఏం విలువ ఉంటుందని జగన్ ప్రశ్నించారు.

వైసీపీ హయాంలో ఎలాంటి స్కామ్‌ జరగపోయినా కొందర్ని బెదిరించి భయపెట్టి తప్పుడు సాక్ష్యాలు సృష్టించి, తప్పుడు వాంగ్మూలాలతో భయాన పరిస్థితులు సృష్టిస్తున్నారని ఆరోపించారు జగన్. చిన్న స్థాయి ఉద్యోగుల నుంచి పారిశ్రామికవేత్తల వరకు అందరినీ బెదిరిస్తున్నారని ఆన్నారు. అసలు వీటితో సంబంధం లేని వ్యక్తులను కూడా కేసులో లాగి ఇబ్బందులు పెడుతున్నారని జగన్ అన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos