ఏపీ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ విపక్ష వైసీపీ రచ్చ చేస్తున్న వేళ సర్కార్ తీసుకున్న ఒక నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. విజయవాడ, విశాఖపట్నంలో రోడ్లను ప్రయోగాత్మకంగా పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది.  ఈ రెండు నగరాల్లో కలిపి మొత్తం 112 కిలోమీటర్ల మేర రోడ్లను రూ.478 కోట్ల ఖర్చుతో చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మొత్తం 56 పనులుగా వీటిని విభజించారు. వీటి కోసం మున్సిపల్ శాఖ త్వరలో టెండర్లు కూడా ఆహ్వానించబోతోంది. ఈ రోడ్ల పనులు చేసిన కాంట్రాక్టర్లకు పదేళ్లలో ఆ మొత్తం వసూలు చేసుకునే అవకాశం కల్పిస్తారు.

విజయవాడ, విశాఖలో నగరపాలక సంస్థలు ఈ రోడ్ల నిర్మాణానికి అవసరమైన నిధుల్లో 40 శాతం తొలి ఏడాది కాంట్రాక్టర్లకు చెల్లిస్తాయి. మిగతా 60 శాతాన్ని మాత్రం పదేళ్లలో వాటికి దశల వారీగా చెల్లిస్తాయి. దీని కోసం ప్రత్యేక ఎస్క్రో అకౌంట్లు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇందులో భాగంగా రోడ్లతో పాటు ఫుట్ పాత్ లు, లైట్లు, ట్రాఫిక్ సైన్ బోర్డులు, బెంచీలు, చెత్తబుట్టలు, హాకర్ జోన్ల ఏర్పాటు కూడా చేస్తారు. పదేళ్లలో వీటి నిర్వహణ కూడా ఆయా సంస్థలే చూస్తాయి. ఈ విధానం విజయవంతమైతే రాష్ట్రంలోని మిగిలిన నగరాలు, పట్టణాల్లోనూ పీపీపీ విధానంలో రోడ్లను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో విపక్ష వైసీపీ మెడికల్ కాలేజీల్ని పీపీపీ విధానంలో చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేస్తుండటం, తాజాగా మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆరోపిస్తూ కోటి సంతకాలు తీసుకుని గవర్నర్ కు సమర్పించడం తెలిసిందే.  ఈ నేపథ్యంలో విజయవాడ, విశాఖలో రోడ్లను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం చర్చనీయాంశమైంది. తాజాగా సీఎం చంద్రబాబు .. రోడ్లను కూడా పీపీపీ విధానంలో అభివృద్ధి చేస్తున్నప్పుడు మెడికల్ కాలేజీల్ని సైతం అదే విధానంలో చేస్తే తప్పేముందని పలువురు రాజకీయ నాయకులు, ప్రజాస్వామ్య సంఘాల నాయకులు వైసీపీని ప్రశ్నిస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos