క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు అంటే ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థులదే హవా ఉంటుంది. ప్యాకేజీలు, ఉద్యోగాలు అన్నీ బీటెక్‌, బీఈ విద్యార్థులకే ఉంటాయి. కానీ.. శ్రీకాకుళం జిల్లా వాసి హనుమంతు సింహాచలం అనే ఆర్ట్స్‌ స్టూడెంట్ ... ఇంజినీరింగ్‌ విద్యార్థులకు తాను ఏమీ తీసిపోనని నిరూపించాడు. రూ.1.3 కోట్ల భారీ వార్షిక ప్యాకేజీతో పోలాండ్‌కు చెందిన ప్రముఖ డెయిరీ సంస్థ (కోవైస్క్‌)లో హెచ్‌ఆర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం సాధించి చరిత్ర సృష్టించాడు. ..  హనుమంతు సింహాచలం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మాస్టర్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ (MHRM) పూర్తి చేశాడు.

హనుమంతుది శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం ఉద్దండపాలెం గ్రామం. తల్లిదండ్రులు భీమారావు, కమలకుమారి వ్యవసాయం చేస్తుంటారు. ఇతని విద్యాభ్యాసమంతా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కాలేజీల్లోనే సాగింది. 2022లో ఏయూలో ఎంహెచ్‌ఆర్‌ఎం కోర్సులో చేరాడు. అప్పటి నుంచి అధ్యాపకులు, ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ సలహా మేరకు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌పై ప్రత్యేక దృష్టిపెట్టాడు. ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడు. 

అనంతరం 2024లో కోర్సు పూర్తయిన వెంటనే క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో హిందుస్తాన్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌లో రూ.3.6 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. అక్కడ పనిచేస్తూనే క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ సలహా మేరకు మెరుగైన అవకాశాల కోసం ప్రయత్నించాడు. ఈ క్రమంలో పోలాండ్‌లోని డెయిరీ సంస్థ తమ హెచ్‌ఆర్‌ విభాగంలో పోస్టుల భర్తీకి వర్సిటీ అధికారులను సంప్రదించగా.. ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌... హనమంతుకి సమాచారం ఇచ్చారు. లింక్డిన్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా ఇంటర్వ్యూకు హాజరు కాగా.. హనుమంతు ఇంగ్లీషు మాట్లాడిన తీరు పోలాండ్‌లోని డెయిరీ సంస్థ వారికి నచ్చింది. అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుని ఆ సంస్థ ఇతన్ని రూ.1.3 కోట్ల వార్షిక వేతనంతో హెచ్‌ఆర్‌ అసిస్టెంట్‌గా ఎంపిక చేసింది. మేలో విధుల్లో చేరేందుకు సిద్ధంకావాలని సమాచారం ఇచ్చింది. అందుకు తగిన విధంగా హనుమంతు సిద్ధమవుతున్నాడు. 

ఇక్కడ ఇంకొక మిరాకిల్ చోటు చేసుకుంది. ఇప్పటి వరకు ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజనీరింగ్‌ విద్యార్థి పేరిట ఉన్న అత్యధిక ప్యాకేజీ రికార్డును హన

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Take Oath As A TDP National Working President | CM Chandrababu | AG

తాజా వార్తలు

15-49-17-0617.jpg

మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం.. ఆర్టీజీఎస్ పై సమీక్షలో అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
2026-06-22 Time: 03:49:17

15-31-26-0626.jpg

ప్రజా ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్టులు.. 4 అంశాలపై ప్రోగ్రెస్ రిపోర్టులను విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు
2026-06-22 Time: 03:31:26

17-02-16-0616.jpg

అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు.. చిన్నారులతో కలిసి రాగి జావ తీసుకున్న చంద్రబాబు
2026-06-20 Time: 05:02:16

14-06-28-0628.jpg

90వ రోజు ప్రజాదర్బార్.. వివిధ సమస్యలపై ప్రజల  వినతుల స్వీకరణ.. అన్నివిధాల అండగా ఉంటానట్టు  మంత్రి లోకేష్ హామీ
2026-06-16 Time: 02:06:28

14-04-35-0635.jpg

సెమీకండక్టర్ల తయారీకి ఏపీ బెస్ట్ డెస్టినేషన్.. సింగపూర్‌లో సెమీకండక్టర్లపై సెమీకాన్ ఎకోసిస్టమ్ సదస్సులో సీఎం చంద్రబాబు
2026-06-16 Time: 02:04:35

Related Videos