ఏపీ డిప్యూటీ స్పీకర్ పదవిపై కూటమి ప్రభుత్వంలో ఉత్కంఠ కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీకి స్పీకర్ పదవి దక్కడంతో డిప్యూటీ స్పీకర్ పదవి ఏ పార్టీ ఛేజిక్కించుకోబోతుందన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. కమలం పార్టీ చీఫ్ విప్ లపై గురి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. ఎవరిని ఏ పదవి వరించబోతుందన్న సస్పెన్స్ కొనసాగుతున్నది. డిప్యూటీ స్పీకర్ తో పాటు విప్ పదవులను మూడు పార్టీలు ఎలా పంచుకోబోతున్నాయని చర్చ ఆసక్తికరంగా మారింది.

స్పీకర్ గా టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ఉండడంతో.. డిప్యూటీ స్పీకర్ పదవి బీజేపీ కా లేక జనసేనకా అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. డిప్యూటీ స్పీకర్ పదవిని జనసేనాని పవన్ కళ్యాణ్ అడుగుతున్నారంటూ జనసేన వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నదని పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తోంది.

డిప్యూటీ స్పీకర్ రేసులో టీడీపీ తరఫున మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్ పేరు గట్టిగా వినిపిస్తోంది.. ఆయనతోపాటు విశాఖకు చెందిన బీసీ నేత గణబాబు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీలో చర్చ నడుస్తోంది. స్పీకర్ అయ్యన్నపాత్రుడు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో.. గణబాబుకు అవకాశాలు తక్కువేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

చీఫ్ విఫ్ రేసులో ధూళిపాల నరేంద్ర తోపాటు జీవీ ఆంజనేయులు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. చీఫ్ విప్ లు గతంలో కేవలం నలుగురే ఉండేవారు.. వైసీపీ హయాంలో 9 మందికి విఫ్ ల అవకాశం దక్కింది.. ఇప్పుడు ఆ సంఖ్యను 14కి పెంచే ఆలోచనలో కూటమి సర్కార్ ఉందని తెలుస్తోంది. నామినేటెడ్ పోస్టులు ప్రధాన పదవులు మిస్సయిన నేతలకు చీఫ్ విప్ పదవి కట్టబెట్టాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుందా అని ... అందులో భాగంగా జనసేనకి నాలుగు, బీజేపీకి రెండు పదవులు ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

జనసేన నుంచి విప్ గా పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, మరో ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ ఆరుగురిలో నలుగురికి విప్ పోస్టులు దక్కే ఛాన్స్ ఉందని జనసేన వర్గాలు చెబుతున్నాయి.

అలాగే బీజేపీ నుంచి విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రేస్ లో ఉన్నట్లు కమలనాధులు ప్రచారం చేస్తున్నారు. ఈ పోస్టులపై త్వరలోనే ఓ క్లారిటీ రాబోతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఏం జరుగుతుందో మరి చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos