విదేశాల్లో వ్యాపారాలు అభివృద్థి చేసుకొని అక్కడే స్థిరపడిన మన తెలుగు ప్రముఖులు పలువురు త్వరలో ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీలో టీడీపీ తప్ప మిగిలిన ప్రధాన పార్టీలకు విదేసీ నేతల ప్రెజర్ పెద్దగా లేదు. ఎటూ వైసీపీ ... రాబోయే ఎన్నికల్లో అధికారం లోకి వచ్చే అవకాశం లేదనే టాక్ విస్తృతంగా వినిపిస్తుండటంతో ఎన్ఆర్ఐ లు మెయిన్ గా టీడీపీ స్థానాలపై ఫోకస్ చేసి...  ఆ పార్టీ అధిష్ఠానం దృష్టిలో పడాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే విదేశీ వలస పక్షులుగా పిలువబడే ఎన్ఆర్ఐ ల వల్ల ఎంతవరకూ ఉపయోగం అన్న అంశం ఇప్పుడుతెరపైకి వస్తోంది. వారు ఇక్కడ పోటీ చేసి గెలిచినా, ఓడినా స్థానికంగా అందుబాటులో ఉండరనే విమర్శ విమర్శ ఉండనే ఉంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా గెలిచిన గల్లా జయదేవ్ ను ఈ సందర్భంగా ఆ నియోజక వర్గ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఆయన పార్లమెంట్ లో ఏపీకి సంబంధించిన పలు సమస్యలపై సమర్థవంతంగా గొంతెత్తి ప్రశ్నించడమే ప్రస్తావించడమే కాకుండా... మిష్టర్ ప్రైమ్ మినిస్టర్ అని మోదీని నిలదీశారు కూడా. కానీ... ఆయన లోకల్ గా అందుబాటులో లేకపోవడంపై స్థానికుల్లో అసంతృప్తి ఉంది. ఇదిలాఉండగా... గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన క్రమంలో ఇప్పుడు ఆ స్థానానికి పలువురు ఎన్ ఆర్ ల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో గుంటూరు లోక్‌సభ స్థానానికి ప్రవాసాంధ్ర ప్రముఖుడు పెమ్మసాని చంద్రశేఖర్‌కు టీడీపీ టికెట్టు ఖాయమని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన 2014లో నర్సరావుపేట లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ టికెట్‌ ఆశించారు. కానీ అప్పుడు ఆ అవకాశం మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావును వరించింది. చంద్రశేఖర్‌ ఆ తర్వాత టీడీపీ రాజకీయ కార్యకలాపాల్లో కనిపించలేదు. ఆయన మంగళవారం రాత్రే స్వదేశానికి చేరుకున్నారు. ఇప్పుడు ఈ స్థానానికి ఆయన పేరు వినిపిస్తోంది. ప్రత్యామ్నాయంగా సరైన అభ్యర్థి లేనిచోట ప్రవాస నేతలను ఎంచుకోవచ్చునని, కానీ అన్ని వనరులు ఉండి స్థానికంగా మంచి సంబంధాలు ఉన్నచోట కూడా బయటి వారిని ఎంచుకోవడం ఎందుకన్న ప్రశ్నలు ఆ పార్టీ  వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. గుంటూరు లోక్‌సభ స్థానంలో ఆర్థికంగా దీటైన స్థాయి ఉన్న అభ్యర్ధులు ఇక్కడే ఎంతో మంది ప్రముఖులు ఉన్నారు. ఉదాహరణకు భాష్యం రామకృష్ణ, భాష్యం ప్రవీణ్‌, కంచర్ల సుధాకర్‌ వంటివారు టీడీపీ రేసులో ఉన్నారు. అందుబాటులో ఉండే వీరిని వదిలిపెట్టి మరొక వైపు చూడటం సరికాదేమో అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే గత ఐదు ఎన్నికల నుంచి ప్రతి ఎన్నికల సమయంలో పెద్ద సంఖ్యలో ప్రవాస నేతలు టీడీపీ టికెట్‌ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం చేసిన వారెవరూ ఎన్నికల తర్వాత మళ్లీ కనిపించడం లేదు. తాము నివాసం ఉంటున్న దేశాలకు వెళ్లిపోయి అక్కడ వ్యాపారాలు, ఉద్యోగాల్లో నిమగ్నమవుతున్నారు. దీంతో ప్రవాస నేతలపై గురి కుదరడం లేదు. అక్కడక్కడా అరుదుగా ఒకరిద్దరు ప్రవాస నేతలు బాగా ముందుగానే రాష్ట్రానికి వచ్చి తమ కార్యక్షేత్రాన్ని ఎంచుకొని వివిధ రూపాల్లో పనిచే స్తూ పునాది నిర్మించుకొంటున్నారు. ఉదాహరణకు గుడివాడలో వెనిగళ్ల రామ్మోహన్‌ ఏడాదిన్నర ముందు నుంచే అక్కడ మకాం పెట్టి పనిచేస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీద అర డజను మంది ప్రవాస నేతలు అసెంబ్లీ టికెట్ల కోసం, ముగ్గురు ఎంపీ టికెట్ల కోసం గట్టిప్రయత్నాల్లో ఉన్నారు. వారి ప్రయత్నాలు ఫలిస్తాయో వికటిస్తాయో మరి చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos