వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత ఘోరమైన రాజకీయ వ్యూహాలు అమలు చేస్తోంది. గతంలో తమ ప్రభుత్వంలో అసలు పెట్టుబడులు రాకుండా చేసిన వారు ఇప్పుడు .. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల్ని ఆపేందుకు కోర్టుల్లో అడ్డగోలు పిటిషన్లు వేస్తున్నారు. దేశంలో ఐటీ స్పేస్ డెవలప్‌ చేయడంలో నెంబర్ వన్ గా ఉన్న సత్వ కంపెనీకి ఇవ్వాలనుకుంటున్న భూమి విషయంలో హైకోర్టులో పిటిషన్లు దాఖలు కావడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. వైసీపీకి చెందిన వారంతా ఈ పిటిషన్లు వేశారు. వైసీపీ లాయర్లు వాదించబోతున్నారు.

ఒక్క సత్వకు కేటాయించాలనుకున్న భూమిపై మాత్రమే కాదు.. ఇప్పటికే టీసీఎస్ కు ఇచ్చిన భూములపై పిటిషన్లు వేశారు. ఇతర ఐటీ కంపెనీలకు ఇస్తున్న భూములపైనా పిటిషన్లు వేశారు. చివరికి గూగుల్ డేటా సెంటర్ కోసం సేకరిస్తున్న భూముల విషయంలోనూ.. ఓ చనిపోయిన వ్యక్తి పేరుతో పిటిషన్ వేసి దొరికిపోయారు. వీరు చేస్తున్న కుట్రలు, ఏపీకి పెట్టుబడులు రాకుండా కోర్టుల ద్వారా.. న్యాయ వివాదాలను సృష్టించే ప్రయత్నాలు చేయడం విస్మయానికి గురి చేస్తోంది. అసలు వీరి సమస్య ఏంటి అన్న చర్చ ప్రజల్లో వస్తోంది.

రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తూంటే.. వైసీపీ నేతలు రాజకీయ కుట్రలకే కాదు.. రాష్ట్రంపై కుట్రలకు ..పెట్టుబడులు రాకుండా చేయడానికి కూడా వ్యవస్థల్ని అడ్డం పెట్టుకుంటున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి రాజకీయ నేతలకు ప్రజలే గట్టి బుద్ది చెప్పాల్సి ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. వైసీపీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తన మైండ్ సెట్ మార్చుకోవాలని లేకపోతే .. ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సిన వస్తుందని రాజకీయవర్గాలు అంటున్నాయి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos