మాజీ ముఖ్యమంత్రి జగన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. రెండో విడత భూ సమీకరణను తప్పు బట్టారు. తొలి విడతలో తీసుకున్న భూములను అభివృద్ధి చేయకుండా.. రెండో విడత ఎందుకని ప్రశ్నించారు. రైతుల నుంచి పంటల భూములు తీసుకున్నారని.. ఇప్పుడు మరో విడత ఏంటని నిలదీసారు. అదే సమయంలో విజయవాడ - గుంటూరు మధ్య రాజధాని నిర్మాణం చేపడితే బాగుంటుందని జగన్ సూచించారు. మౌళిక వసతుల అభివృద్ధికే లక్ష కోట్లు అవుతుందని జగన్ లెక్కలు చెప్పుకొచ్చారు.
రివర్ బేసిన్ లో రాజధాని నిర్మాణం చేస్తున్నారని, నదీ పరివాహక ప్రాంతంలో భవనాలను నిర్మిస్తేనే అంగీకరించరని... రాజధాని నిర్మాణం ఎలా సాధ్యమని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టు సైతం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రివర్ బేసిన్ లో కాకుండా విజయవాడ - గుంటూరు మధ్య రాజధాని నిర్మాణం చేస్తే బాగుండేదని జగన్ మరోసారి పేర్కొన్నారు. అమరావతి లో ఇప్పటికీ చెబుతున్న స్థాయిలో ఎక్కడా అభివృద్ధి కనిపించటం లేదని చెప్పారు. రోడ్లు, డ్రైనేజీ, కరెంట్, మంచినీరు వంటి మౌలిక వసతుల కల్పనే ఎకరాకు రెండు కోట్లు కావాలని.. ఆ లెక్కన వసతుల కల్పన కోసమే లక్ష కోట్లు అవసరం అవుతాయని జగన్ లెక్కలు చెప్పారు. ఎక్కడ నుంచి ఈ మొత్తం తీసుకొస్తారు.. ఎలా సాధ్యం అవుతుందని జగన్ ప్రశ్నించారు. అమరావతి రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయటం లేదని, భూములు ఇచ్చిన రైతులు ఆందోళనలో ఉన్నారని
జగన్ పేర్కొన్నారు.
దీంతో జగన్ వ్యాఖ్యల పైన మంత్రి నారాయణ ఘాటుగా స్పందించారు. లీగల్ గా ఎలాంటి సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, రివర్ బేసిన్ లో ఎక్కడా నిర్మాణాలు లేవని మంత్రి స్పష్టం చేసారు. ప్రతీ రాష్ట్రానికి రాజధాని అవసరమని, అమరావతికి వ్యతిరేకంగా పని చేయటం వల్లనే మీరు 2019 లో 11 సీట్లకు పరిమితం అయ్యారని చెప్పుకొచ్చారు. ప్రజల ఆమోదంతోనే లాండ్ పూలింగ్ చేస్తున్నామని, ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి సమాచారం లేకుండా వ్యాఖ్యలు చేయటం సరికాదని ఆయన అన్నారు. నదీ గర్భంలో రాజధాని లేదనే విషయం జగన్ తెలుసుకోవాలని సూచించారు. రాజధాని మాస్టర్ ప్లాన్ పైన అవగాహన లేకుండా మాట్లాడటం సరి కాదని, వర్షాల కారణంగా అమరావతిలో పనులు జరగలేదని.. తరువాత వేగవంతం అయిన ట్లు నారాయణ వివరించారు. చెప్పిన సమయానికే రాజధానిలో నిర్మాణాలను పూర్తి చేస్తామని నారాయణ స్పష్టం చేసారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos