ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన నేపథ్యంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ట్వీట్ చేశారు. ఈసారైనా అమరావతి కట్టేనా ? లేక మళ్లీ మట్టేనా ? అంటూ ఎద్దేవా చేశారు. 10 ఏళ్ల క్రితం మట్టి తెచ్చి మన నోట్లో కొట్టారని.. మన ఆశల మీద నీళ్లు చల్లి వెళ్లారని వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆమె ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

"ప్రధాని నరేంద్ర మోదీ గారు @narendramodi.. ఈసారైనా అమరావతి కట్టేనా ? లేక మళ్లీ మట్టేనా ? 10 ఏళ్ల క్రితం మట్టి తెచ్చి మన నోట్లో కొట్టారు. మన ఆశల మీద నీళ్లు చల్లి వెళ్లారు. ఇప్పుడు రాజధాని పునఃశంకుస్థాపనకు వస్తున్న మోదీ గారికి ఇదే అమరావతి మట్టిని బహుమతిగా పంపిస్తున్నాం. ఈ మట్టిని చూసిన ప్రతిసారి 2015లో తొలి శంకుస్థాపనలో ఇచ్చిన హామీలు గుర్తు రావాలి.10 ఏళ్లుగా చేసిన మోసంపై ఆత్మ విమర్శ చేసుకోవాలి" అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

"మోదీ గారు ఈ మట్టి సాక్షిగా ప్రమాణం చేసి అమరావతిలో అడుగు పెట్టాలి. మరోసారి ఇలాంటి మోసం చేయనని ప్రమాణం చేయాలి. విభజన హామీల్లో రాజధాని నిర్మాణం పూర్తిగా కేంద్రం బాధ్యత. ఆ బాధ్యతకు కట్టుబడి ఉన్నానని, దిల్లీని మించిన రాజధాని కట్టిస్తా అని రాసి సంతకం పెట్టాలి. మాకు అప్పులు వద్దు. మా భావితరాల మీద ఆ భారం వద్దు. రాజధాని నిర్మాణం కోసం బేషరతుగా రూ.1.50 లక్షల కోట్లను మూడేళ్లలో కేంద్రం ఇవ్వాలి. ఈ ప్రకటన మోదీ గారు చేయాలి. అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించాలి. అలాగే పదేళ్లుగా అమలుకు నోచుకోని విభజన హామీలపై స్పష్టత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం" అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు ప్రధాని మోదీ అమరావతి రాకవేళ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై విజయవాడలో బీజేవైఎం కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్ దగ్గర నిరసనకు దిగిన షర్మిలపై బీజేవైఎం కార్యకర్తలు కోడిగుడ్లు, టమోటాలతో దాడి చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos