భారత రాజ్యాంగంలోని  ఆర్టికల్ 190(4)  ప్రకారం, ఒక శాసనసభ సభ్యుడు సభ అనుమతి లేకుండా వరుసగా  60  పని దినాల  పాటు  సమావేశాలకు గైర్హాజరైతే, సభ ఆ సభ్యుడి సీటును ఖాళీగా ప్రకటించవచ్చు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇదే నిబంధనను ప్రస్తావిస్తూ, వైసీపీ ఎమ్మెల్యేలు పూర్తిగా హాజరు కావడం లేదని వారిపై చర్యల విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. గతంలో కొంత మంది అటెండెన్స్ కోసం రిజిస్టర్‌లో సంతకాలు పెట్టి.. లోపలికి రాకపోవడంతో..  ఇప్పటికే ఏఐ ఆధారిత కెమెరాల ద్వారా డిజిటల్ అటెండెన్స్ ప్రవేశపెట్టారు. 

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వరని, అందుకే ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని వారు వాదిస్తున్నారు.  స్పీకర్ దృష్టిలో ఇది రాజ్యాంగ విధిని విస్మరించడమే. సభ్యులు సంతకాలు చేసి సభలోకి రాకపోవడాన్ని ఆయన తీవ్రంగా పరిగణిస్తున్నారు. త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు.  సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఈ వ్యవహారంపై స్పందించారు.  రాజ్యాంగ పరిధిలో ఉంటే ఏ నిర్ణయానికైనా సిద్ధమని, కానీ కక్ష సాధింపు చర్యలకు దిగితే ఊరుకోబోమని హెచ్చరించారు. 60 రోజుల లెక్కింపులో సభ వాయిదా పడిన  లేదా ప్రోరోగ్ అయిన రోజులను మినహాయించాల్సి ఉంటుంది. ఈ సాంకేతిక అంశాలను వైసీపీ ఆయుధంగా చేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం గనక వేటు వేస్తే న్యాయపోరాటం చేయాలని అనుకుంటున్నారు. 

వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం అనేది కూటమి ప్రభుత్వానికి రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. ఒకవేళ 11 మంది ఎమ్మెల్యేలపై వేటు వేస్తే, ఆ స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయి. ఇది ప్రభుత్వంపై ఆర్థిక భారం కావడమే కాకుండా, వైసీపీకి సానుభూతి పవనాలు వీచే అవకాశం ఇస్తుందని కొందరు విశ్లేషకుల అభిప్రాయం.  ప్రజాప్రతినిధులు బాధ్యతారాహిత్యంగా ఉంటే సహించేది లేదనే గట్టి సందేశాన్ని ప్రజల్లోకి పంపడానికి ప్రభుత్వం ఈ సాహసం చేసే అవకాశం లేకపోలేదన్న చర్చ కూడా నడుస్తోంది. అసెంబ్లీకి వెళ్లకపోవడాన్ని ప్రజలు కూడా సమర్థించరని అంటున్నారు.

స్పీకర్ కేవలం అనర్హత గురించి మాత్రమే కాకుండా,  పని చేయని వారికి జీతం లేదనే విధానాన్ని కూడా తెరపైకి తెచ్చారు. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేల జీతభత్యాల్లో కోత విధించాలని ఆయన లోక్‌సభ స్పీకర్‌కు కూడా లేఖ రాయాలని భావిస్తున్నారు. ఇది దేశవ్యాప్తంగా ఒక చర్చకు దారితీస్తోంది. ప్రజాప్రతినిధుల జవాబుదారీతనంపై వస్తున్న ఈ ప్రతిపాదనలకు ప్రజల నుంచి మద్దతు లభించే అవకాశం ఉంది. అనర్హత  వేటు విషయంలో స్పీకర్ నిర్ణయమే అంతిమమైనప్పటికీ, అది న్యాయ సమీక్షకు లోబడి ఉంటుంది. ప్రభుత్వం నిజంగానే వైసీపీ ఎమ్మెల్యేలను ఇంటికి పంపాలని నిశ్చయించుకుంటే, రాజ్యాంగపరమైన లొసుగులు లేకుండా పక్కాగా అడుగులు వేయాల్సి ఉంటుంది. మరోవైపు వైసీపీ కూడా తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతోంది.  ఈ క్రమంలో ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుందో మరి చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos