పలు రాష్ట్రాల్లో అవలంభించిన గెలుపు ఫార్మూలాను ఢిల్లీ గల్లీలో అమలు చేయబోతోంది. ఏపీ సెంటిమెంట్‌తో ఢిల్లీలో కూడా తిరుగులేని విక్టరీ కొట్టాలని భావిస్తోంది బీజేపీ అధిష్ఠానం.. సార్వత్రిక ఎన్నికల ప్రభంజనం తర్వాత మహారాష్ట్రలో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. 132 స్థానాల్లో గెలిచి బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది.

ఏపీలో కూటమి నేతలు మహారాష్ట్రలో ప్రచారానికి వెళ్లడం.. అక్కడ విజయం సాధించడాన్ని బీజేపీ సెంటిమెంట్‌గా భావిస్తోంది. ఇప్పుడదే సెంటిమెంట్‌ను ఢిల్లీలోనూ ప్రయోగించాలనుకుంటోంది. హస్తినలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార, విపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారంలో మునిగిపోయాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ సీఎం చంద్రబాబును ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో దింపబోతుంది. ఫిబ్రవరి 1న ఢిల్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు చంద్రబాబు. తెలుగువాళ్లు నివసించే ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయబోతున్నారు.

అయితే మరో స్టార్ క్యాంపెయినర్ పవన్ కల్యాణ్ షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. పవన్ స్టార్ గా.. హిందూత్వవాదంతో ఇటీవలి కాలంలో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.  మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారంతో బీజేపీ పెద్దలకూ ఆయనపై మంచి నమ్మకం ఏర్పడింది. ఈ క్రమంలో పవన్ కూడా ప్రచారంలో విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటారని చెబుతూ వచ్చారు. అయితే ఎన్నికల ప్రచార గడువు ముగుస్తున్నా పవన్ ప్రచార తేదీలు ఇంకా ఖరారు కాలేదు. 

ఐదో తేదీన ఢిల్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. మూడో తేదీన ప్రచారం ముగుస్తుంది. ఆ రోజున సాయంత్రం ఐదుగంటలకే ముగించాలి కాబట్టి.. రెండో తేదీ లోపే పవన్ కల్యాణ్ ప్రచారం చేయాల్సి ఉంది. అయితే ఇంతవరకు పవన్ ప్రచారంపై కాలేదు. మరోవైపు పవన్ కల్యాణ్ సైతం  ప్రచారంలో పాల్గొంటారనే వార్తలు కూడా వస్తున్నాయి. బహిరంగ సభలు, రోడ్‌ షోలు ఎక్కడెక్కడ ఎలా ఉండాలన్న దానిపై త్వరలో క్లారిటీ రానుందని కూటమి నేతలు అంటున్నారు. కూటమి నేతల ప్రచారం మహారాష్ట్రలో వర్కవుట్ అయినట్టే ఢిల్లీలోనూ కలిసొస్తుందని బీజేపీ అధిష్ఠానం లెక్కలేసుకుంటోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos