అమరావతి : ప్రపంచ బ్యాంక్‌ ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి సంబంధించిన నిర్మాణ పనులకు మొదటి విడత నిధులను విడుదల చేసింది. ఈ నిధుల మొత్తం ₹3,535 కోట్లు కాగా, ఇవి నేడు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో జమ కానున్నాయి. ప్రపంచ బ్యాంక్‌ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌కి ₹6,700 కోట్ల రుణం మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ మొత్తం నిధుల్లో తొలి విడతగా ₹3,535 కోట్లు విడుదల చేయడంతో అమరావతి రాజధాని నిర్మాణంలో ఒక కీలక దశ పూర్తయ్యింది.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తన స్వంత నిధులతో రాజధాని నిర్మాణాలు ప్రారంభించింది. ఇక, ప్రపంచ బ్యాంక్‌ నిధులు విడుదల కావడంతో త్వరలో ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB) నుంచి కూడా తొలి విడత రుణం విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ADB కూడా ₹6,700 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఈ రెండు బ్యాంకుల నుంచి ₹13,600 కోట్ల రుణం అందే అవకాశం ఉంది. అదనంగా, కేంద్రం నుండి ₹1,400 కోట్లు ప్రత్యేక సహాయంగా అందనున్నాయి. హడ్కో ద్వారా ₹11 కోట్లు కూడా రుణంగా సమీకరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

అలాగే, జర్మనీ ఆర్థిక సంస్థ నుండి ₹5,000 కోట్లు రుణం తీసుకునేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. మొత్తంగా, ప్రపంచ బ్యాంకు మరియు ADB రుణాలను గత డిసెంబర్‌ నెలలోనే ఆమోదం పొందినప్పటికీ, అమరావతి రాజధాని సంబంధిత కొన్ని అభ్యంతరాల కారణంగా ఈ నిధులు కొంత ఆలస్యంగా విడుదలయ్యాయి. అయితే, ఇప్పుడు మొదటి విడత నిధులు రావడంతో అమరావతి నిర్మాణం వేగవంతమయ్యే అవకాశాలు ఉన్నాయి.

 

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos