తిరుమల శ్రీవారి ఆలయంలో కల్తీ నెయ్యి వివాదం గురించి ఇంకా మరిచిపోక ముందే ఇప్పుడు ఏపీలో మరో ఆలయంలో ఇలాంటి వివాదమే ఒకటి జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలోని ప్రముఖ ఆలయ ప్రసాదంలో పురుగులు ప్రత్యక్షమయ్యాయి. పిఠాపురంలో కొలువైన పదో శక్తి పీఠం పాదగయ క్షేత్రంలో కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ఈ ఘటన జరిగింది. ధనుర్మాస పూజలు జరుగుతున్న క్రమంలో సోమవారం శివుడి జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం కావడంతో ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. వేకువజాము నుంచే భక్తులు ఆలయానికి క్యూ కట్టారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయంలో భక్తులకు ప్రసాదాల జరిగింది. ఇందులో భాగంగా ప్రసాదంగా పులిహోర ఇతరులు చేయగా అందులో పురుగులు ప్రత్యక్షం అయ్యాయి. ఇలా దేవుడి ప్రసాదంలో పురుగులు కనిపించడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆలయ అధికారుల్ని ప్రశ్నించారు.. ప్రసాదంలో పురుగులు రావడంపై ఫిర్యాదు చేశారు. కాగా ఆలయంలో నాణ్యత లేని సరకులతో ప్రసాదం తయారు చేస్తున్నారని, ప్రసాదం తయారీపై అధికారుల పర్యవేక్షణ ఉండాలని.. ఈ ఘటనపై ఆరా తీసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భక్తులు, పలు హిందూ సంఘాలు కోరాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలోని ఆలయంలో ఇలా జరగడం చర్చనీయాంశమైంది. ప్రసాదంలో పురుగులు వచ్చిన అంశంపై ఆలయ అధికారులు స్పందించాల్సి ఉంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos