వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇంఛార్జీల మార్పు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఆరు జాబితాలు ప్రకటించిన అదిష్టానం ... తాజాగా రిలీజ్ చేసిన ఏడో జాబితాలో కేవలం ఇద్దరి పేర్లు మాత్రమే అనౌన్స్ చేసింది. ప్రకాశం జిల్లా పర్చూరు ఇన్ ఛార్జీగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్‌​ను  ఆ పదవి నుంచి తప్పించి ... ఆ స్థానంలో ఎడం బాలాజీని నియమించింది. ఈ ఎన్నికల్లో తాను పర్చూరు నుంచి పోటీ చేయలేనని...చీరాల నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని  ఆమంచి ఎంతోకాలంగా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో పర్చూరు నియోజకవర్గానికి కొత్త ఇంచార్జ్ గా ఎడం బాలాజీ పేరును ప్రకటించింది వైసీపీ అధిష్టానం. ఎడం బాలాజీ గతంలోనూ పర్చూరు వైసీపీ ఇంఛార్జిగా పని చేశారు. 2019 ఎన్నికలకు ముందు ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరారు. తాజాగా నిన్న సీఎం జగన్ ను కలిసి పర్చూరు గురించి చర్చించారు. ఈ క్రమంలో ఆయనను పర్చూరు వైసీపీ ఇంచార్జిగా నియమించడం గమనార్హం. అలాగే అదే జిల్లా లోని మరో నియోజకవర్గమైన కందుకూరు సిట్టింగ్ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డిని మార్పు చేశారు. ఈ స్థానంలో మహిళా నేత అరవిందా యాదవ్ ను ఇంఛార్జ్‌గా నియమించారు  కాగా, వైసీపీ అధిష్టానం ఇప్పటివరకు ఆరు విడతల్లో 63 అసెంబ్లీ, 16 లోక్‌సభ సీట్లకు ఇంఛార్జులను నియమించింది .ఇంకా పార్టీ అధిష్టానం ఎన్ని లిస్టులు రిలీజ్ చేస్తుందనే దానిపై  పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos