ఏపీలో తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై సిట్ రిపోర్ట్ తర్వాత రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. సిట్ రిపోర్ట్ తర్వాత జంతువుల కొవ్వు కలిసిందన్న చంద్రబాబు, పవన్ గత వ్యాఖ్యల్ని వైసీపీ తప్పుబడుతుంటే.. కల్తీ జరిగిందని తేలాక కూడా ఈ దబాయింపులేంటని కూటమి ప్రశ్నిస్తోంది. ఇదే క్రమంలో వైసీపీ నేత అంబటి చంద్రబాబును తిట్టడం, దీనిపై పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి రిమాండ్ కు పంపడం జరిగిపోయాయి. ఇది కాస్త కాపు రాజకీయం రంగు పులుముకుంది.

ఈ నేపథ్యంలో కాపు నేత ముద్రగడ పద్మనాభరెడ్డి కుమార్తె, జనసేన నేత క్రాంతి బార్లపూడి .. వైసీపీ చేస్తున్న కాపు రాజకీయాలపై తీవ్ర విమర్శలు చేస్తూ ట్వీట్ చేశారు. ఇందులో లడ్డూ కల్తీ అయిందని సీబీఐ చెప్పినా క్లీన్ చిట్ ఇచ్చేసినట్లు వైసీపీ హడావిడి చేస్తోందన్నారు. 60 లక్షల కిలోల నెయ్యి భయంకరమైన రసాయనాలతో తయారయ్యిందని తేల్చారని, ఈ రసాయనాల్లో చౌకగా దొరికే జంతువుల కొవ్వు కాకుండా ఇంకేముంటుందని ప్రశ్నించారు. దీన్ని దారి మళ్లించడం కోసమే అంబటి, జోగి రమేశ్ తో చంద్రబాబును తిట్టించి రాజకీయ ప్రయోజనం పొందాలని వైసీపీ చూసిందన్నారు.

జగన్ పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్తే చంద్రబాబు వచ్చాక పోలవరం, అమరావతి పనులు ముందుకెళ్తున్నాయని క్రాంతి తెలిపారు. దీనికి తోడు పెట్టుబడులు కూడా వస్తున్నాయన్నారు. పవన్ కూడా పంచాయతీరాజ్ శాఖను పరుగులు తీయిస్తున్నారని, కుంకీ ఏనుగులు తెప్పించి,మన్యంలో రోడ్లు వేయించి, 13 వేల పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించారన్నారు. ఇవన్నీ చూడలేక జగన్ అభద్రతాభావంతో కులాల గొడవలు రేపుతున్నారన్నారు.

లడ్డూ కల్తీ జరగలేదని తన తండ్రి ముద్రగడ ఎలా అనగలుగుతున్నారో అర్ధం కావట్లేదన్నారు. గతంలో ఆయన ఉద్యమాన్ని వాడుకుని వైసీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. జగన్ హామీలు నిలబెట్టుకోకపోయినా తన తండ్రి మద్దతునివ్వడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అయినా జగన్ ఆయన్ను గుర్తించలేదన్నారు. అధికారంలో ఉండగా రాష్ట్రాన్ని నలుగురు రెడ్లకు అప్పగించి ఇప్పుడు అధికారం పోగానే కాపులు గుర్తొస్తున్నారా అని జగన్ ను ఆమె ప్రశ్నించారు. జగన్ కు అధికారంలో ఉంటే రెడ్లు కావాలి అధికారం పోతే కాపులు కావాలన్నారు. అంబటి రాంబాబను వాడుకుని ఏ విధంగా అల్లర్లు చేయాలని చూస్తున్నారో, అలాగే రేపు మా నాన్నగారిని కూడా వాడుకుని బలి పశువుని చెయ్యరన్న గ్యారెంటీ ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా జగన్ ఉచ్చులో పడి కాపులు మరోసారి మోసపోవద్దని కోరారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos