ఎపి లోని కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకురు గ్రామ సమీపంలో జరిగిన  బస్సు ప్రమాదంపై అసత్య ప్రచారం చేస్తున్న 27 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ జాబితాలో వైసీపీ సీనియర్ నేత ఆరే శ్యామల, మాజీ ఎమ్మెల్యే సీవీ రెడ్డి, మరొకరు కందుకూరి గోపికృష్ణతో పాటు వైసీపీ పార్టీ అధికారిక ఎక్స్ (ట్విటర్) పేజీ నిర్వాహకులు కూడా ఉన్నారు. అక్టోబర్ 24న జరిగిన ఈ ప్రమాదంలో 19 మంది మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు దర్యాప్తులో మద్యం మత్తులో  బైక్ నడిపిన యువకుడు కారణమని తేల్చగా, దీన్ని 'బెల్ట్ షాపులు, కల్తీ మద్యం' కారణంగా చిత్రీకరించి ప్రచారం చేశారు. అందుకే కేసులు నమోదు చేశారు. 

పోలీసులు పరిశీలించిన సీసీటీవీ ఫుటేజ్‌లు, సాక్ష్యాలు ప్రకారం, ప్రమాదానికి మద్యం తాగి బైక్ నడిపిన శివశంకర్ (25) కారణమని తేలింది. శివశంకర్ మరో వైపు రోడ్డుపై పడిపోయి మరణించాడు. అతని స్నేహితుడు ఎర్రి స్వామి (22)ను పోలీసులు అరెస్ట్ చేసి ప్రశ్నించారు. స్వామి వాంగ్మూలం ప్రకారం, తన స్వగ్రామానికి  వెళ్తూండగా  శివశంకర్ 'డోన్‌లో దింపుతాను' అని చెప్పి బైక్ ఎక్కమని అడిగాడు. ఇద్దరూ మద్యం తాగి బయలుదేరారు. రోడ్డు డివైడర్‌ను బైక్ ఢీకొట్టడంతో శివశంకర్ అక్కడికక్కడే మరణించాడు. స్వామి అతని మృతదేహాన్ని పక్కకు తరలించి, బైక్‌ను రోడ్డు మధ్యలోనే వదిలేసాడు. అంతలో వచ్చిన కావేరీ బస్సు బైక్‌ను ఈడ్చుకుని ముందుకు వెళ్లడంతో ప్రమాదం జరిగింది. స్వామికి స్వల్ప గాయాలు అయ్యాయని పోలీసులు తెలిపారు.

పోలీసులు పెట్రోల్ బంక్‌లో శివశంకర్ బైక్‌కు పెట్రోల్ వేయించుకున్న సీసీటీవీ ఫుటేజ్‌ను విడుదల చేశారు. దీని ఆధారంగా మద్యపానం, అధిక వేగం కారణంగా ప్రమాదం జరిగినట్టు నిర్ధారణ అయింది. ప్రమాదం జరిగిన తర్వాత వైసీపీ నేతలు, సోషల్ మీడియా ద్వారా 'బెల్ట్ షాపుల్లో విక్రయించే కల్తీ మద్యం వల్లే ప్రమాదం జరిగిందని'  ప్రచారం చేశారు. లైసెన్స్‌డ్ మద్యం  షాపులోనే కొన్నట్లుగా సీసీ ఫుటేజీ లభ్యమయింది. తప్పుడు  ప్రచారం చేస్తున్న వారిపై కర్నూలు మండలం బి. తాండ్రపాడుకు చెందిన వ్యక్తి ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు కర్నూలు తాలుకా అర్భన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 27 మంది పేర్ల జాబితాలో ముఖ్యంగా ఆరే శ్యామల ఉన్నారు. వైసీపీ అధికారిక ఎక్స్ పేజీ నిర్వాహకులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. పోలీసులు ఈ పోస్టులు, వీడియోలు, మెసేజ్‌లను సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.  ప్రమాద కారణాలు స్పష్టంగా తేలాయని, అసత్య ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రకటించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos