మద్యం కుంభకోణం కేసులో జగన్ అరెస్టు దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందా..  వచ్చే నెల 10లోపు అరెస్టు చేస్తారా.. ఆయన సన్నిహితుడు అదే విషయం చెబుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భారీగా మద్యం కుంభకోణం జరిగిందని కూటమిసీబీఐ దర్యాప్తునకు ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. రూ.3,500 కోట్లు హవాలా రూపంలో మద్యం కుంభకోణం ధనాన్ని పక్కదారి పట్టించారని సీబీఐ ప్రాథమిక నిర్థారణకు వచ్చింది. వెనువెంటనే ప్రత్యేక దర్యాప్తు కోసం సిట్ ను ఎంపిక చేసింది. అప్పటి నుంచి విచారణ మరింత వేగవంతం అయ్యింది. అరెస్టులు కూడా కొనసాగుతున్నాయి.

తొలుత సూత్రధారిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి అరెస్టయ్యారు. అటు తరువాత జగన్ జమానాలో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారిగా పనిచేసిన ధనుంజయరెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి అరెస్టయ్యారు. అటు తరువాత జగన్ సన్నిహితుడు, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీని సైతం అరెస్టు చేశారు. ఈ అరెస్టుల తీరు చూస్తుంటే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. సరిగ్గా ఇటువంటి తరుణంలో జగన్ స్పందించారు. విజయవాడలో ఉంటాను తనను అరెస్టు చేసుకోవాలని సవాల్ విసిరారు.

ఈ క్రమంలోఈ క్రమంలో ఇప్పుడు మద్యం కుంభకోణం విషయంలో మరింత వేగం పెంచాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో చర్చించినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలో జగన్ ఒకప్పటి సన్నిహితుడు విజయసాయిరెడ్డి సన్నిహితుల వద్ద సంచలన విషయం వెల్లడించినట్టు తెలుస్తోంది. మద్యం కుంభకోణంలో జగన్ అరెస్టు తప్పదని చెప్పినట్టు సమాచారం. ఎప్పుడు అరెస్టు చేస్తారో కూడా చెప్పినట్టు ప్రచారం సాగుతోంది. విశ్వసనీయ సమాచారం మేరకు జగన్మోహన్ రెడ్డిని వచ్చే నెల 10 తేదీలోపు అరెస్టు చేస్తారని తెగేసి చెప్పినట్టు సమాచారం. ఇప్పటికే తనను కెలకొద్దు అంటూ జగన్ కోటరీకి గట్టిగానే చెప్పారు విజయసాయిరెడ్డి. కానీ వైసీపీ సోషల్ మీడియా అదే పనిగా విజయసాయిరెడ్డిని టార్గెట్ చేసుకోవడంతో జగన్మోహన్ రెడ్డి అరెస్టు విషయంలో ఆయన కలత చెంది ఈ వ్యాఖ్య చేసినట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి విషయంలో అదే ఆలోచనతో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ముందుగా ఈ స్కాంలో సూత్రధారులు, పాత్రధారులను పట్టుకున్నారు. వారి వద్ద కేసుకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించారు. చివరకు జగన్ చుట్టూ ఉచ్చు బిగించారు. మద్యం కుంభకోణానికి సంబంధించి పూర్తిస్థాయి వివరాలు ప్రజల ముందు ఉంచనున్నారు. తద్వారా ప్రజలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయనున్నారు. మరోవైపు కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న తరుణంలో ప్రభుత్వానికి వచ్చిన చిక్కు లేదు. జగన్మోహన్ రెడ్డికి కనీసం ప్రజల్లో సానుభూతి కూడా దక్కకుండా పావులు కదపాలని చూస్తోంది. ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాలు ఎంతవరకూ వర్కవుట్ అవుతాయో మరి చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Take Oath As A TDP National Working President | CM Chandrababu | AG

తాజా వార్తలు

Related Videos