ఆస్తుల వివాదంలో జగన్ రెడ్డి తన ఇబ్బందులు తానే కొని తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆ ఇబ్బందులను ఎవరు తొలగిస్తారా అని ఎదురు చూస్తున్నారు. పులివెందులలో మూడు రోజుల పర్యటనకు వెళ్లిన జగన్... తన బంధువుల ఇళ్లకు స్వయంగా వెళ్తున్నారు. వైఎస్ బంధువులు అంతా క్రిస్టియన్సే. ఎవరూ దీపావళి పండుగ జరుపుకోరు. పండుగ శుభాకాంక్షలు చెప్పడానికి ఆయన వెళ్లలేదు. తన ఇంట్లో ..స్వయంగా తాను పెట్టుకున్న నిప్పును ఆర్పాలని ఏదో దారి చూపాలని అడిగేందుకు ఆయన వెళ్లారు.

గతంలో జగన్ రెడ్డి దగ్గరకే అందరూ రావాలి. బంధువులయినా ... ఎవరయినా అసలు తగ్గరు. అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు వచ్చి మంచీచెడూ చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు జగన్ రెడ్డి వారి ఇళ్లకు వెళ్తున్నారు. వైఎస్ మనోహర్ రెడ్డి, వైఎస్ ప్రకాష్ రెడ్డి వంటి బంధువుల ఇళ్లకు వెళ్లారు. మరో మూడు, నాలుగు ఇళ్లకు వెళ్లి అక్కడ పెద్దలతో చర్చలు జరిపి వచ్చారు. అంతా తన తల్లితో రాయబారం కోసమేనని గుసగుసలు వినిపిస్తున్నాయి.

విజయమ్మ రాసిన బహిరంగ లేఖతో జగన్ రెడ్డి వికృత మనస్తత్వం.. తల్లీ, చెల్లీనీ మోసం చేయాలనుకున్న వ్యవహారం ప్రజల ముందు బయటపడింది. ఈ నెగిటివ్ ఇమేజ్ నుంచి బయటపడాలని ఆయన చేస్తున్న ప్రయత్నాలు అంత తేలికగా ఫలించే అవకాశాలు కనిపించడం లేదు. అందుకే ఏదోవిధంగా పరిష్కారం చేసుకుందామని అమ్మతో రాయబారం నడపాలని జగన్ వారిని బతిమాలుతున్నారు. జగన్ కోర్టుకు కూడా వెళ్లిన తర్వాత మేమేం చేయగలమని ఆయన బంధువులు సమాధానమిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు జగన్ ఇంకేం చేస్తారో మరి చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos