వైసీపీ నేతలకు శవ రాజకీయాలు చేయడం వెన్నతో పెట్టిన విద్య అని అందరికీ తెలుసు. ఆ పార్టీ అధినేత జగన్ రెడ్డి ఎక్కడైనా శవాలు కనిపిస్తే తప్ప బయటకు రారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పుంగనూరు వెళ్లేందుకు తాజాగా రెడీ అయ్యారు. ఎందుకంటే అక్కడో ఏడేళ్ల పాప చెరువులో పడి చనిపోయింది. మిస్సింగ్ కేసు నమోదయ్యాక పదకొండు బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి చెరువులో మృతదేహం కనిపించింది. అసలేం జరిగిందో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
జగన్ రెడ్డి శవరాజకీయం చేయడానికి ఎక్కడా ఏమీ దొరకడం లేదని అనుకున్నారేమో కానీ.. ఈ పాప మిస్సయినప్పటి నుంచి వైసీపీ మీడియా సాక్షి.. ఏదో జరగబోతోందని కవరేజీ ఇస్తూ వస్తోంది. చివరికి చనిపోయినట్లుగా తేలడంతో శివాలెత్తిపోతోంది. జగన్ రెడ్డి కి శవం దొరికిందనే ఆనందమో ఏమో కానీ.. ఇప్పుడు ఆ శవాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయడానికి ఏ మాత్రం తగ్గడం లేదు. చిన్న పిల్లలకు రక్షణ లేదా అని ప్రశ్నిస్తున్నారు. చిన్నారిని హత్య చేశారని సాక్షి పత్రిక తేల్చేసింది. వాళ్లకు ఎలా తెలుసనేది పోలీసులు తేల్చనున్నారు.
ఈ చిన్నారి చనిపోవడాన్ని… మదనపల్లి ఫైళ్లు దగ్దం కావడాన్ని ప్రస్తావిస్తూ అర్థరహితంగా మాట్లాడుతున్నారు. ఆ కేసులో అంత వేగం చూపించారు.. ఈ చిన్నారి చనిపోతే పట్టించుకోరా అని అతి తెలివి ప్రదర్శిస్తున్నారు. 9వ తేదీ జగన్ రెడ్డి పుంగనూరు వెళ్లి అదే ఏడుపు ఏడవడం ఖాయంగా కనిపిస్తోంది. కానీ వీరి శవ రాజకీయాలు చూసి .. చిన్న పిల్లల్ని కూడా వదలరా అని సామాన్యులు సైతం ఆశ్చర్యపోతున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos