మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ వైఎస్ సునీతా రెడ్డి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి వచ్చారు. ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డితో కలిసి సీఎంవో కార్యాలయానికి వెళ్లారు.. అక్కడ వైఎస్ వివేకా హత్య కేసు విచారణ పురోగతిపై అధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది. అంతేకాదు సునీత ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా కలిసినట్లు తెలుస్తోంది. గతవారం సునీత కడపలో ఎస్పీని కూడా కలిశారు.. ఇప్పుడు తాజాగా అసెంబ్లీకి రావడం ఆసక్తికరంగా మారింది.

రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి జైలు అధికారులకు రాసిన లేఖపై స్పందించాలని కోరినట్లు తెలుస్తోంది. అంతేకాదు సుప్రీం కోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుకు సంబంధించి.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అఫిడవిట్ వేయడంతో పాటు.. ఈ కేసు దర్యాప్తులో పురోగతిపై ఆరా తీసినట్లు సమాచారం. వైఎస్ సునీత ముందుగా హోంమంత్రి అనితతో మాట్లాడిన అనంతరం సీఎంవో కార్యాలయానికి వెళ్లి అధికారులతో భేటీ అయ్యారని చెబుతున్నారు. తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పురోగతిని సునీత రెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారని సమాచారం.

వైఎస్ వివేకా హత్య కేసులో మరికొన్ని పరిణామాలు మొదలయ్యాయి. కడప ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై సుప్రీంలో విచారణ ప్రారంభమవుతోంది. వివేకా కేసులో అవినాష్‌కు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని సునీత సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇటు వివేకా పీఏ కృష్ణారెడ్డి కోర్టులో చేసిన ఫిర్యాదుతో సునీత రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, సీబీఐ ఎస్పీ రామ్‌‌సింగ్‌పై నమోదైన కేసులో కూడా విచారణ వేగవంతం అయ్యింది. ఈ మేరకు కృష్ణారెడ్డి వాంగ్మూలాన్ని కడప పోలీసులు రికార్డు చేసిన సంగతి తెలిసిందే. ఇలా వైఎస్ వివేకా హత్య కేసులో వరుసగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

ఇటు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో నిందితుడికి బెయిల్ మంజూరైంది. హత్య కేసులో ఏ3 నిందితుడిగా ఉన్న గజ్జల ఉమాశంకర్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఉమాశంకర్ రెడ్డి ప్రతి శనివారం పులివెందుల సీఐ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. ఉమాశంకర్‌రెడ్డి ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. మొత్తానికి ఇంతకాలం నిస్తేజంగా ఉన్న వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పుడు చలనం రావడం సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos