ఏపీలో కాంగ్రెస్ దూకుడు పెంచిందా.. వైసీపీ లేని లోటును భర్తీ చేసే పనిలో పడిందా.. తిరుమల లడ్డూ వ్యవహారం తర్వాత ఫ్యాన్ పార్టీ డౌన్ ఫాల్ అయ్యిందా.. లడ్డూ వ్యవహారం తర్వాత కొందరు వైసీపీ నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారా అంటే... అవుననే సమాధానాలు బలంగా వినిపిస్తున్నాయి.

తిరుమల లడ్డూ వ్యవహారంపై గత వైసీపీ ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది. దాని నుంచి తప్పుకునేందుకు కుంటీ సాకులు వెతుకుతోంది. ఒకప్పుడు ఆ పార్టీ నేతలు సీబీఐ విచారణ కావాలంటూ గొంతెత్తారు. చివరకు సుప్రీంకోర్టు ఆదేశాలతో స్పెషల్ సిట్ వేయడంతో ఆ పార్టీ నేతలకు నోటి వెంట మాట రాలేదు. సింపుల్‌గా చెప్పాలంటే లడ్డూ వ్యవహారంపై తప్పించుకునే ప్రయత్నం చేశారు ఆ పార్టీ అధినేత జగన్. సిట్ లేదు.. బిట్టు అవసరం లేదని తప్పించుకునే ప్రయత్నం చేశారు. లడ్డూ వ్యవహారంపై వైసీపీ నేతలు ఆలోచన పడ్డారు. దీనికితోడు అధినేత ప్రజలకు దూరంగా తాడేపల్లి టు యలహంక ప్యాలెస్‌కు చక్కర్లు కొట్టడంతో ఆ పార్టీ పనైపోయిందనే వాదన క్రమంగా బలపడుతోంది.

ఫ్యాన్ పార్టీకి చెందిన నేతలు టీడీపీ కంటే జనసేనలోకి వెళ్లాలని ఆలోచన చేశారు. లడ్డూ వివాదం నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దీక్షకు దిగడంతో ఆ తర్వాత సనాతన ధర్మం కాన్సెప్ట్ వెలికి తీయడంతో ఆ పార్టీకి లైఫ్ లేదన్నది కొందరి నేతల అంచనా. ఈ సమయంలో కాంగ్రెస్ ఒక్కటే మార్గమని భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా... ఏపీలో ప్రతీ విషయంపై వైఎస్ షర్మిల తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజల తరపున పోరాడుతూ నిత్యం ప్రజల మధ్యలో ఉంటున్నారు. వైసీపీ నేతల చూపు ఇప్పుడు ఏపీ కాంగ్రెస్‌పై పడింది. జగన్ కంటే షర్మిల బెటరన్న అంచనాకు వచ్చారు. దీనికితోడు దేశంలో క్రమంగా కాంగ్రెస్ వైపు పవనాలు వీస్తున్నాయి. మోదీ పాలనను గమనించిన ప్రజలు, ఆ పార్టీకి లైఫ్ లేదన్నది కొందరి నేతల ఆలోచన.

త్వరలో ఢిల్లీ, మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ నుంచి కాంగ్రెస్‌లోకి చేరికలు ఉంటాయని అంటున్నారు. చాలామంది వైసీపీ నేతలు షర్మిలతో మంతనాలు సాగిస్తున్నారు. తెలంగాణ మాదిరిగానే ఏపీలో హస్తం పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికిప్పుడు కాకపోయినా త్వరలోనే కాంగ్రెస్‌లోకి వలసలు ఉంటాయని కొందరు నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.

ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీలో ఉండటం కంటే.. దేశంలో మళ్లీ పుంజుకుంటున్న జాతీయ పార్టీ కాంగ్రెస్‌లోకి వెళ్తే.. తగిన ప్రాధాన్యం దక్కుతుందనే ఆలోచనలో నేతలు ఉన్నారట. ఈ మేరకు షర్మిలను సంప్రదిస్తున్నట్లు సమాచారం. మరి ఆ నేతలు ఎప్పుడు ఎలా ఝలక్ ఇస్తారో మరి చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos