ఏపీ రాజకీయాల్లో కీలక సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తరువాత రాజ్యసభ.. శాసనమండలిలో ఆ పార్టీ సభ్యులు కూటమి వైపు వెళ్తున్నారు. ఇప్పటికే ముగ్గురు రాజ్యసభ ఎంపీలు కూటమిలో చేరగా..సాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఇక, తాజాగా వక్ఫ్ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందిన వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ వైసీపీ నిర్ణయించింది. లోక్ సభలో వ్యతిరేకంగా ఓటింగ్ చేసారు. రాజ్యసభ లో మాత్రం వైసీపీ ఎంపీ ఒకరు క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లు తెలుస్తోంది. లోక్ సభలో వైసీపీకి చెందిన నలుగురు సభ్యులు వ్యతిరేకంగా ఓటింగ్ చేసారు. ఈ బిల్లుకు ఏపీ నుంచి ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేన మద్దతు ఇచ్చారు. కొన్ని సవరణలు ప్రతిపాదించిన టీడీపీ బిల్లుకు మద్దతు ఇచ్చింది. జనసేన కూడా బిల్లుకు మద్దతు ప్రకటించింది. టీడీపీ నిర్ణయం తో ఏపీలోని ముస్లిం వర్గాలు నిరసనలు నిర్వహించాయి. ఇదే సమయంలో వైసీపీ పైన టీడీపీ గురి పెట్టింది. వైసీపీ రాజ్యసభలో అనుకూలంగా ఓటింగ్ చేసిందని టీడీపీ నేతలు ఆరోపించారు. దీని పైన వైసీపీ స్పందించింది. రాజ్యసభలో ప్రస్తుతం వైసీపీకి ఏడుగురు సభ్యులు ఉన్నారు. కాగా, ఒక వైసీపీ సభ్యుడు బిల్లుకు అనుకూలంగా ఓటు వేసినట్లు ప్రచారం సాగుతోంది. వ్యక్తిగతంగా ఎవరు క్రాస్ ఓటింగ్ చేసారనే అంశం పైన ఓపెన్ గా చెప్పే అవకాశం ఉండదనే చర్చ ఉంది. ఇదే సమయంలో పెద్దల సభలో వ్యతిరేక ఓట్లు లెక్క కంటే ఒకటి ఎక్కువగా వచ్చిందని.. వైసీపీకి చెందిన ఒక సభ్యుడు క్రాస్ ఓటింగ్ చేసారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అందులో భాగంగా వైసీపీకి చెందిన ఒక సబ్యుడి పేరు ప్రచారంలోకి వచ్చింది. ఆ సభ్యుడి తో నేరుగా బీజేపీ నేతల సంప్రదింపులతో ఆయన బిల్లుకు అనుకూలంగా ఓటింగ్ చేసారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.

జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త సీఎం నివాసానికి వచ్చి తమ సంస్థల్లో కీలకంగా ఉన్న వ్యక్తికి రాజ్యసభ సీటు ఇవ్వాలని కోరారు. దీనికి అంగీకరించిన జగన్ రాజ్యసభ సీటు ఖరారు చేసారు. కేంద్రంలో వైసీపీ - బీజేపీ మధ్య ఆ ఎంపీ సైతం కీలకంగా వ్యవహరించారు. కాగా, ఇప్పుడు బీజేపీకి వక్ప్ బిల్లు ప్రతిష్ఠాత్మకం కావటంతో ఆ పార్టీ నేతలు వైసీపీ ఎంపీ పైన ఒత్తిడి చేయటం ద్వారా.. క్రాస్ ఓటింగ్ చేసారని భావిస్తున్నారు. కాగా టీడీపీ ఆరోపణలు చేస్తున్న వేళ రాజ్యసభలో జరిగిన ఓటింగ్ లో ఆ ఎంపీ క్రాస్ ఓటింగ్ చేసినట్లు ఏ విధంగా నిరూపణ చేయాలి.. విప్ ధిక్కరించినట్లు నిర్ధారణ అయితే వైసీపీ ఏం చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos