వైఎస్ఆర్ కడప జిల్లా రికార్డుల పరంగా వైసీపీకి ఎంతో కాలంగా వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తోంది. అయితే 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆ జిల్లాలో కూడా పార్టీ పరిస్థితి రివర్స్ అయింది. ప్రస్తుతం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరిగిపోతోంది. ఆ పార్టీ క్యాడర్ మొత్తం టీడీపీలోకి వెళ్లిపోతోంది. దాడులు, దౌర్జన్యాలు ఏమీ లేకపోయినా రాజకీయ భవిష్యత్ కోసం ఎక్కువ మంది అదే పని చేస్తున్నారు. వారికి భరోసా కల్పించడంలో వైసీపీ అధినాయకత్వం విఫలమవుతోంది.

తాజాగా రవీంధ్రనాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా పదేళ్లు అధికారం చెలాయించిన కమలాపురం మున్సిపాలిటీ కౌన్సిలర్లు టీడీపీలో చేరిపోయారు. దీంతో మున్సిపల్ చైర్మన్ ను మార్చేయబోతున్నారు. ప్రొద్దుటూరు, రాజంపేట మున్సిపాలిటీల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. చివరికి కడప మేయర్ స్థానంలో టీడీపీకి అధికారికంగా ఒక్క కార్పొరేటర్ ఉన్నారు. కానీ ఇప్పుడు పొలిటికల్ సీన్ మారిపోయి మొత్తం కార్పొరేషన్ టీడీపీలోకి వచ్చేలా ఉంది. పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే పులివెందుల మున్సిపల్ కౌన్సిలర్లు కూడా టీడీపీ వైపు చూస్తున్నారు. వారికి జగన్ కాంట్రాక్టులు ఇచ్చారు కానీ బిల్లులు ఇవ్వలేదు. పార్టీ కోసం కాకపోయినా బిల్లుల కోసం అయినా టీడీపీలో చేరుతామని వారు సంకేతాలు ఇస్తున్నారు. ఇంకా టీడీపీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

జడ్పీ చైర్మన్ పీఠం కదిలిపోవడంతో జగన్ రెడ్డి ప్రత్యేకంగా జడ్పీటీసీల్ని తాడేపల్లికి పిలిపించుకుని బతిమాలుకున్నారు. పరువు తీయవద్దని అడిగి.. తలా ఓ తాయిలం ప్రకటించారు. ఇలా చెప్పుకుంటూ పోతే .. వైసీపీని నడిపించే నాయకుడు కడప జిల్లాలో లేకుండా పోయారు. చివరికి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా తన మేనమామ రవీంధ్రనాథ్ రెడ్డిని నియమించారు . ఆ నిర్ణయం కూడా ఎదురు తన్నే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos