భారత బలగాలు చేసిన ఆపరేషన్ సింధూర్ ప్రతీకార దాడుల్లో 11 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారని పాక్ ఒప్పుకుంది. ఆ దాడుల్లో మరో 78 మంది పాక్ సైనికులు గాయపడ్డారని స్పష్టం చేసింది.  ఉగ్రవాదుల అంతమే లక్ష్యంగా భారత బలగాలు గత వారం పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK)లో 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి విజయవంతంగా నేలమట్టం చేశాయి. అనంతరం పాక్ డ్రోన్ దాడులు, క్షిపణి దాడులకు ప్రయత్నించగా భారత సైన్యం దుమ్మురేపింది. పాక్ నుంచి వచ్చిన వాటిని వచ్చినట్లు గాల్లోనే పేల్చివేసి విజయం సాధించింది. అంతటితో ఆగకుండా పాక్‌లోని పలు నగరాల్లో ఎయిర్ బేస్ కేంద్రాలపై భారత్ చేసిన దాడుల్లో తమకు నష్టం జరిగిందని పాకిస్తాన్ ఎట్టకేలకు అంగీకరించింది.

పాకిస్తాన్ లోని ఉగ్రస్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని, ఆర్మీ జోలికిగానీ, పాక్ ప్రజలను కానీ టచ్ చేయలేదని స్పష్టం చేసినా పాక్ పెడచెవిన పెట్టింది.  మే 7 నుంచి మే 10 తేదీల మధ్య పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులతో భారతదేశంపై దాడికి ప్రయత్నించి నవ్వులపాలు అయింది. పాక్ నుంచి వచ్చిన డ్రోనల్లు, క్షిపణులతో పాటు ఫైటర్ జెట్స్ ను సైతం భారత బలగాలు ఎస్ 400 సాయంతో కూల్చేశాయి. కేవలం ఉగ్రవాదులను టార్గెట్ చేస్తే.. పాక్ తోక జాడించడాన్ని సీరియస్ గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం భారత బలగాలు సత్తా చాటాలని సూచించింది. దాంతో పాక్ లోని లాహోర్, కరాచీ, రావల్ఫిండి లాంటి నగరాలలో ఎయిర్ బేస్ స్థావరాలపై భారత్ డ్రోన్, క్షిపణి దాడులతో దుమ్మురేపింది. భారత్ దాడుల్లో పాక్ కు భారీ నష్టం జరిగింది. 

మొదట భారత్ పంపిన డ్రోన్లు, ఫైటర్ జెట్లు, క్షిపణులను కూల్చివేశామని పాక్ ఆర్మీ ప్రకటించుకోగా, పాక్ ప్రభుత్వం సైతం ప్రజలతో విజయోత్సవాలు చేసుకుని నవ్వులపాలు అయింది. ఈ క్రమంలో అమెరికా మధ్యవర్తిత్వం చేయడం, కాల్పుల విరమణకు పాక్ నుంచి పదే పదే రిక్వెస్ట్ రావడంతో ప్రాణ నష్టం జరగకూడదని భావించి భారత్ కాల్పుల విమరణకు అంగీకరించింది. మే 10న కాల్పుల విమరణ తరువాత పరిస్థితి కొంత సద్దుమణిగింది.  సోమవారం సైతం పాక్, భారత్ డీజీఎంలు ఆన్‌లైన్‌లో సమావేశమై చర్చించారు. తాము కాల్పులు జరపడం, దాడులకు దిగడం లాంటివి చేసే ఉద్దేశం లేదని పాక్ స్పష్టం చేసింది. కాగా ఇటీవల పాక్ లోకి చొచ్చుకెళ్లి పలు నగరాల్లోని ఎయిర్ బేస్ సెంటర్లపై భారత్ జరిపిన దాడుల్లో 11 మంది తమ సైనికులు మృతిచెందగా, పలువురు జవాన్లు గాయపడ్డారని పాక్ అంగీకరించక తప్పులేదని జాతీయ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos