తెలుగు రాష్ట్రాల్లో 14 వైద్య కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణలో 9 కాలేజీలను సీఎం కేసీఆర్ వర్చువల్‌గా ప్రారంభించారు. విజయనగరంలో పర్యటించిన ఏపీ సీఎం జగన్ కూడా 5 కాలేజీలు వర్చువల్ గా ప్రారంభించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ... కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వ కాలేజీలను ప్రారంభించగా... ఆయా జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
మెడికల్ కళాశాలల ఏర్పాటుతో కలిగే ప్రయోజనాలను, మెడికల్ కళాశాలలకు అనుబంధంగా ఉండే హాస్పిటల్లో అందే వైద్య సేవలను ప్రజలకు తెలియజేయాలని ప్రజాప్రతినిధులకు ఇటీవల మంత్రి కేటీఆర్, హరీష్ రావు సూచించిన నేపథ్యంలో మెడికల్ కళాశాలలు ప్రారంభమైన జిల్లాల్లో భారీ ర్యాలీలను నిర్వహించారు. వేలాదిగా వచ్చిన వారితో కరీంనగర్ లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ రేకుర్తి నుండి కొత్తపల్లి లోని మెడికల్ కళాశాల వరకు కొనసాగింది. ఇదిలా ఉంటే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో నూతనంగా నిర్మించిన మెడికల్ కళాశాల ప్రారంభ కార్యక్రమానికి, రాష్ట్ర మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. వర్చువల్ విధానంలో సీఎం కేసీఆర్ మెడికల్ కాలేజీలు ప్రారంభించిన కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.
మరోవైపు ఏపీలో ఐదు వైద్య కాలేజీలను సీఎం జగన్ ప్రారంభించారు. విజయనగరంలో పర్యటించిన జగన్మోహన్ రెడ్డి... మొదట అక్కడ మెడికల్ కాలేజీని ప్రారంభించారు. అక్కడి నుంచి వర్చువల్‌గా రాజమండ్రి, ఏలూరు, మచిలీ¬పట్నం, నంద్యాలలో కూడా కళాశాలలు ప్రారంభించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos