కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై కేసు నమోదైంది. గురువారం ఉదయం పార్లమెంటు ప్రాంగణంలో చోటు చేసుకున్న ఘటన నేపథ్యంలో బీజేపీ ఎంపీలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలకు గాయాలు కావడానికి రాహుల్ గాంధీనే బాధ్యుడని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీలు హేమంగ్ జోషి, అనురాగ్ ఠాకూర్, బాన్సురీ స్వరాజ్ పార్లమెంట్ స్ట్రీట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద రాహుల్‌పై కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

పార్లమెంట్ ప్రాంగణంలో గురువారం ఉదయం బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టడం... అదే సమయంలో అంబేద్కర్‌ను అవమానించింది కాంగ్రెస్ పార్టీనే అంటూ అధికార బీజేపీకి చెందిన సభ్యలు కూడా నిరసనలకు దిగడం..  ఇరువర్గాల పోటాపోటీ నిరసనలు జరగటంతో పార్లమెంట్ ఆవరణలో కొంత ఉద్రిక్తత వాతావరణ ఏర్పడింది. ఈ క్రమంలో చోటు చేసుకున్న తోపులాటలో బీజేపీకి చెందిన ఇద్దరు ఎంపీలు తీవ్రంగా గాయపడ్డారు. రాహుల్ తోసివేయడం వల్లే వారు గాయపడ్డారని, ఆయనపై కేసు నమోదు చేయాలని బీజేపీ ఫిర్యాదు చేసింది.

దీనిపై రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నేతలు ఇప్పుడు మళ్లీ కొత్త డ్రామా మొదలుపెట్టారంటూ విమర్శించారు. అంబేద్కర్‌ విగ్రహం నుంచి తాము శాంతియుతంగా పార్లమెంట్‌ వైవు వచ్చామని.. పార్లమెంట్‌ మెట్ల దగ్గర బీజేపీ ఎంపీలు తమను అడ్డుకున్నారని... అయినా తాము ఎలాంటి దాడులకు పాల్పడలేదని రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నేతలు చెప్పారు. మరోవైపు బీజేపీ ఎంపీలపై కూడా కాంగ్రెస్ ఎంపీల బృందం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన పై విచారణ జరపాలని కోరుతూ స్పీకర్ ఓం బిర్లా కు లేఖ రాశారు కాంగ్రెస్ ఎంపీలు.

ఇదిలావుండగా పార్లమెంటు వద్ద ఘర్షణ జరిగిన నేపథ్యంలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సంచలన నిర్ణయం తీసుకున్నారు.. పార్లమెంట్ ప్రవేశద్వారాల వద్ద నిరసన ప్రదర్శనలను నిషేధించారు . నిన్న అధికార , విపక్షాల సభ్యుల మధ్య జరిగిన తోపులాట నేపథ్యంలో ఈ నిర్ణయం స్పీకర్ తీసుకున్నారు. ఏ ప్రవేశ ద్వారం వద్ద ఎలాంటి నిరసన ప్రదర్శనలు చేయరాదని ఎంపీలందరికీ ఆదేశాలు జారీ చేశారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos